OnePlus 11R Discount Price : అమెజాన్‌లో వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన ఈ 5G ఫోన్ కొనొచ్చు? ధర ఎంత తగ్గిందో తెలుసా?

OnePlus 11R Discount Price : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 11R మోడల్ సేల్ మొదలైంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon)లో డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది.

OnePlus 11R Discount Price : అమెజాన్‌లో వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన ఈ 5G ఫోన్ కొనొచ్చు? ధర ఎంత తగ్గిందో తెలుసా?

OnePlus 11R Discount Price _ OnePlus 11R selling at discounted price on Amazon _ should you buy it

OnePlus 11R Discount Price : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 11R మోడల్ సేల్ మొదలైంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon)లో డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. షరతులు లేకుండా బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్ తర్వాత OnePlus 11Rని రూ. 37,999 ధరకు కొనుగోలు చేయొచ్చు.

అమెజాన్ బ్యాంక్ ఆఫర్‌పై రూ.2వేల డిస్కౌంట్ అందిస్తోంది. OnePlus 11R అనేది భారతీయ యూజర్ల కోసం కంపెనీ రిలీజ్ చేసిన కొత్త ఫోన్‌లలో ఇదొకటి. ఈ స్మార్ట్‌ఫోన్ సరసమైన ధర ట్యాగ్‌లో ఫ్లాగ్‌షిప్-లెవల్ స్పెసిఫికేషన్‌లతో వచ్చింది. OnePlus 11R కొన్ని ముఖ్య ఫీచర్లలో స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC, 120hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 100W SuperVOOC ఛార్జింగ్, 50-MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్, 16GB RAM వరకు పెంచుకోవచ్చు.

Read Also : OnePlus Nord CE 3 Leak : సరసమైన ధరకే వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

వన్‌ప్లస్ 11R ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో OnePlus 11R అధికారికంగా 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో బేస్ మోడల్‌కు రూ. 39,999 ధరతో అందుబాటులో ఉంది. 16GB RAM, 256GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.44,999లకు అందుబాటులో ఉంది. వన్‌ప్లస్11Rపై డిస్కౌంట్ కోసం అమెజాన్ అనేక బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంది. HDFC బ్యాంక్ ఆఫర్ సరసమైన ధరకే అందిస్తోంది. HSBC క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్‌లు రూ. 2వేల డిస్కౌంట్ పొందవచ్చు. వన్‌ప్లస్11R ధర రూ. 37,999కి సొంతం చేసుకోవచ్చు.

OnePlus 11R Discount Price _ OnePlus 11R selling at discounted price on Amazon _ should you buy it_

OnePlus 11R Discount Price _ OnePlus 11R selling at discounted price on Amazon

వన్‌ప్లస్ 11R కొనుగోలు చేయాలా? వద్దా? :
వన్‌ప్లస్ 11R ప్రకారం.. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 40వేల లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉంది. సర్కిల్ కెమెరా మాడ్యూల్‌తో సహా OnePlus 11 లాంటి డిజైన్‌ను అందిస్తుంది. కర్వడ్ డిస్‌ప్లే, కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో వచ్చింది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. OnePlus 11R 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో పంచ్-హోల్ డిజైన్, 120hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

హార్డ్‌వేర్ ముందు.. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌తో పాటు 16GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదైన OnePlus 11 మాదిరిగా 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని అందిస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 11R వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరాలతో వచ్చింది. 50-MP ప్రైమరీ సోనీ IMX890 సెన్సార్‌తో పాటు 8-MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2-MP మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో, ఈ ఫోన్ సెల్ఫీలకు 16-MP కెమెరాను కలిగి ఉంది. మొత్తం మీద.. రూ. 40వేల లోపు మంచి ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.

Read Also : UPI Payment Limit: యూపీఐ పేమెంట్లపై పరిమితి.. ఏ బ్యాంకు డైలీ లిమిట్ ఎంతంటే..