Road to Valor: Empires : పబ్‌జీ మేకర్ క్రాఫ్టన్ నుంచి భారత్‌కు కొత్త గేమ్ వచ్చేసింది.. ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ మొదలైందోచ్..!

Road to Valor: Empires : మొబైల్ గేమర్లకు గుడ్‌న్యూస్.. గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్ నుంచి భారత్‌కు సరికొత్త గేమ్ వచ్చేస్తోంది. PUBG, BGMI తయారీదారు క్రాఫ్టన్ భారత గేమింగ్ మార్కెట్లో కొత్త గేమ్‌ను లాంచ్ చేసింది.

Road to Valor: Empires : పబ్‌జీ మేకర్ క్రాఫ్టన్ నుంచి భారత్‌కు కొత్త గేమ్ వచ్చేసింది.. ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ మొదలైందోచ్..!

BGMI and PUBG maker Krafton launches new game in India, pre-register starts on Google Play and App Store

Road to Valor: Empires : మొబైల్ గేమర్లకు గుడ్‌న్యూస్.. BGMI, PUBG గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్ నుంచి భారత్‌కు సరికొత్త గేమ్ వచ్చేస్తోంది. PUBG, BGMI (బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా) తయారీదారు క్రాఫ్టన్ భారత గేమింగ్ మార్కెట్లో కొత్త గేమ్‌ను లాంచ్ చేసింది. రోడ్ టు వాలర్ : ఎంపైర్స్, రియల్ టైమ్ PvP (ప్లేయర్ వర్సెస్ ప్లేయర్) స్ట్రాటజీ గేమ్ క్రాఫ్టన్ అనుబంధ సంస్థ డ్రీమోషన్ ద్వారా ఈ కొత్త గేమ్ డెవలప్ అయింది. భారత్‌లో Google Play, Apple యాప్ స్టోర్‌లో ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవడానికి కొత్త గేమ్ అందుబాటులో ఉంది. ఈ గేమ్ మార్చి 16 తర్వాత ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది. అయితే ముందుగా రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులు గేమ్‌లో కొన్ని పెర్క్‌లను పొందవచ్చు.

క్రాఫ్టన్ రోడ్ టు వాలర్ : ఎంపైర్స్‌లో కొన్ని భారత-నిర్దిష్ట ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇందులో భారతీయ గేమింగ్ కమ్యూనిటీకి చెందిన ఫుల్ లెవల్ హిందీ లాంగ్వేజీ సపోర్టు ఉంటుంది. కంపెనీ ప్రాంతీయ ధరలను కూడా దృష్టిలో ఉంచుకుని గేమ్ డిజైన్ చేసింది. భారతీయ యూజర్ల కోసం కొన్ని ప్రత్యేకమైన ఇన్-యాప్ రివార్డ్‌లు రూ. 29 నుంచి అందుబాటులో ఉంటాయి. గేమ్ రిలీజ్‌పై క్రాఫ్టన్ ఇండియా CEO సీన్ హ్యూనిల్ సోహ్న్ మాట్లాడుతూ.. ‘భారతీయ గేమర్లు.. ఇండియన్ రివార్డులు, కొత్త UI, ప్రత్యేక ఫీచర్లను యాడ్ చేయనుంది. క్రీడాకారులు, పౌరాణిక, చారిత్రక నాగరికతల ప్రపంచాన్ని విశ్లేషించుకోవచ్చునని ఆశిస్తున్నాము’ అని ఆయన పేర్కొన్నారు.

BGMI and PUBG maker Krafton launches new game in India, pre-register starts on Google Play and App Store

BGMI and PUBG maker Krafton launches new game in India

Read Also : WhatsApp Upcoming Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై పంపిన మెసేజ్‌లను కూడా ఎడిట్ చేయొచ్చు..!

రాబోయే రోడ్ టు వాలర్ : ఎంపైర్స్ క్రాఫ్టన్ పాపులర్ బ్యాటిల్ రాయల్-స్టైల్ గేమ్‌లు, PUBG, BGMI కంటే భిన్నంగా ఉంటాయి. రోడ్ టు వాలర్ అనేది PVP స్ట్రాటజీ గేమ్ అని చెప్పవచ్చు. ఈ గేమ్‌లో ఆటగాళ్ళు వివిధ కేటగిరీల నుంచి సైన్యాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. తద్వారా తమ ప్రత్యర్థులను ఓడించవచ్చు. ఈ కొత్త గేమ్ పాపులర్ ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ ఫ్రాంచైజీని పోలి ఉండవచ్చు. కానీ, ఇందులో ఆటగాళ్ళు పౌరాణిక పాత్రలు మాదిరిగా ఎంచుకోవచ్చు. ఎథీనా, ఓడిన్, సీజర్ వంటి మరిన్నింటి నుంచి గేమర్లు ఎంచుకోగల కొన్ని రోల్స్ ఉన్నాయి. గేమ్ అధికారిక Google Play పేజీ, Road to Valor: Empires ఇతర వార్ గేమ్‌ల నుంచి రియల్ వ్యూతో ఆకట్టుకునేలా ఉంటుంది. మల్టీ-ప్లేయర్ మోడ్‌లను వీక్షించేందుకు సపోర్టు రూంలను హోస్ట్ చేసేందుకు ఆటగాళ్లకు ఒక ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

BGMI and PUBG maker Krafton launches new game in India, pre-register starts on Google Play and App Store

BGMI and PUBG maker Krafton launches new game in India

రోడ్ టు వాలర్ : ఎంపైర్స్ (Road to Valor: Empires) గేమ్ డ్రీమోషన్ ద్వారా డెవలప్ అయింది. దీనిని క్రాఫ్టన్ 2021లో కొనుగోలు చేసింది. ఈ స్టూడియో భారత మార్కెట్లో Ronin: The Last Samurai, Road to Valour: World War II, GunStrider: Tap Strike వంటి ఇతర గేమ్‌లను కూడా అందిస్తుంది. Road to Valor: World War II జనవరి 2019లో లాంచ్ అయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. ఇంతలో, భద్రతా సమస్యల కారణంగా క్రాఫ్టన్ పాపులర్ BGMI, PUBG గేమ్‌లు భారత మార్కెట్లో బ్యాన్ అయ్యాయి.

దాంతో కంపెనీ ఇటీవల PCs కోసం కాలిస్టో ప్రోటోకాల్ అనే కొత్త యాక్షన్ టైటిల్‌ను ప్రారంభించింది. ఇంతకుముందు, క్రాఫ్టన్ ఇండియా మాట్లాడుతూ కంపెనీ ఈ ఏడాదిలో అనుబంధ సంస్థ రైజింగ్‌వింగ్స్ రూపొందించిన కొత్త మొబైల్-నిర్దిష్ట క్యాప్షన్ డిఫెన్స్ డెర్బీ (Defense Derby)ని లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. డిఫెన్స్ డెర్బీ గేమ్ అనుబంధ సంస్థ రైజింగ్ వింగ్స్చే ద్వారా క్రియేట్ అయింది. గేమ్ రియల్ టైమ్ PVP మోడ్‌ను కూడా అందిస్తుంది. గేమ్ ఆడే ఆటగాళ్ళు ప్రత్యేక డెక్‌ని క్రియేట్ చేసుకోవడం ద్వారా కోటను ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also : Tata Motors Dark Edition : టాటా మోటార్స్ నుంచి 10 సరికొత్త ఫీచర్లతో డార్క్ ఎడిషన్ మోడల్ కార్లు.. పూర్తి వివరాలు మీకోసం..!