Union Budget 2023 Updates : మొబైల్ ఫోన్లు, టీవీలు కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గనున్న ధరలు.. పూర్తి వివరాలు మీకోసం..!

Union Budget 2023 Updates : టీవీలు, స్మార్ట్‌ఫోన్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే కొనుగోలుదారులకు శుభవార్త.. త్వరలో ఎలక్ట్రినిక్స్, గాడ్జెట్లు, టీవీలు, మొబైల్ ఫోన్లపై భారీగా ధరలు తగ్గనున్నాయి.

Union Budget 2023 Updates : మొబైల్ ఫోన్లు, టీవీలు కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గనున్న ధరలు.. పూర్తి వివరాలు మీకోసం..!

Union Budget 2023 Updates : టీవీలు, స్మార్ట్‌ఫోన్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే కొనుగోలుదారులకు శుభవార్త.. త్వరలో ఎలక్ట్రినిక్స్, గాడ్జెట్లు, టీవీలు, మొబైల్ ఫోన్లపై భారీగా ధరలు తగ్గనున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ (Budget 2023 Live Updates)ను పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM Sitharaman) ప్రవేశపెట్టారు.

గంటా 30 నిమిషాల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ అనేక అంశాలపై ప్రస్తావించారు. ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరటనిస్తూ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాదు.. రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపులను ప్రకటించారు. కీలక రంగాలకు కేటాయింపులు కూడా అందించారు. పలు వస్తువుల ధరలు అమాంతం పెరగనున్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..

ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు, టీవీలు, స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా దిగిరానున్నాయి. టీవీ ప్యానళ్లపై కస్టమ్ డ్యూటీని కూడా తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల ప్రకటించారు. టీవీ ప్యానళ్లపై కస్టమ్ డ్యూటీని 2.5 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీని కూడా 21 నుంచి 13 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.

దాంతో ఎలక్ట్రిక్ వాహనాలు, టీవీలు, మొబైల్, కిచెన్ చిమ్నీ వంటి ధరలు భారీగా తగ్గనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో సామాన్యూలకు మరింత ఊరటనిస్తోంది. అలాగే, స్టార్టప్‌కు ప్రోత్సాహం ఇస్తామని మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

Budget 2023 Live Updates _ Mobile Phones To Get Cheaper As FM Sitharaman Reduces Import Duty

Union Budget 2023 : Budget 2023 Live Updates _ Mobile Phones To Get Cheaper

Read Also : #UnionBudget2023: రైల్వేకు రూ.2.40 ల‌క్ష‌ల కోట్ల కేటాయింపు… 2013-2014 కంటే 9 రెట్లు అధికం

స్టార్టప్ కంపెనీలకు రిస్క్ తగ్గించేందుకు కృషి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రయోగశాలల్లో వజ్రాల తయారీకి ఐఐటీలకు ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారు. 5G అప్లికేషన్ల తయారీకి 100 ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) డెవలప్‌మెంట్‌కు నిధులు కేటాయిస్తామన్నారు.

మేక్ ఇన్ ఇండియా (Make In India), మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభిస్తామన్నారు. పీఎం కౌశల్ యోజన స్కీమ్ కింద 4 లక్షల మంది నిరుద్యోగులు ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఈ స్కీమ్ కింద నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మూడేళ్ల పాటు 47 లక్షల మంది నిరుద్యోగులకు స్టైఫండ్ కూడా అందించే ప్రయత్నం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల స్పష్టం చేశారు.

సైకిళ్ళు (Cycles), ఆటో మొబైల్‌లు (Automobiles), బొమ్మలు చౌకగా లభించనున్నాయి. కస్టమ్స్ సుంకాన్ని 13 శాతానికి పెంచారు. దిగుమతి సుంకం పెరిగే వస్తువుల్లో హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్‌లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, ప్లాస్టిక్ వస్తువులు, హై-గ్లోస్ పేపర్, స్టీల్ ప్రొడక్టులు, ఆభరణాలు, విటమిన్లు, లెదర్ వంటివి ఉన్నాయి.

ఆభరణాలు, రత్నాల రంగానికి సంబంధించి బంగారం, వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలంటూ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. దేశం నుంచి ఆభరణాలు, ఇతర తుది ఉత్పత్తుల ఎగుమతిని పెంచేందుకు సాయపడుతుందని సూచించింది. గత ఏడాదిలో కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఎలక్ట్రానిక్స్, స్టీల్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలలో కస్టమ్స్ సుంకాలను రద్దు చేసింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Plus Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై రూ.12వేలు డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి!