స్ట్రీమింగ్ కంటెంట్‌పై సెన్సార్ : OTT ప్లాట్ ఫాంపై కఠిన నిబంధనలు? 

  • Published By: sreehari ,Published On : October 7, 2019 / 09:23 AM IST
స్ట్రీమింగ్ కంటెంట్‌పై సెన్సార్ : OTT ప్లాట్ ఫాంపై కఠిన నిబంధనలు? 

OTT యూజర్లకు చేదువార్త. రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్ ఫాంపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. స్ట్రీమింగ్ కంటెంట్ పై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యా్స్టింగ్ మినిస్టర్ ప్రకాశ్ జవదేకర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓటీటీ ప్లాట్ ఫాంపై కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లెక్స్, అమెజాన్ ప్రైమ్ సహా అన్ని ఓటీటీ ఆన్ లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ సర్వీసులను ప్రభుత్వం రెగ్యులేట్ చేయాలనే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఓటీటీ ప్లాట్ ఫాంలను రెగ్యులేట్ చేసే నియంత్రణ వ్యవస్థ లేదనే విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. 

వీటిపై రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉందని తాను కూడా అంగీకరిస్తున్నట్టు జవదేకర్ తెలిపారు. ‘ఓటీటీ ప్లాట్ ఫాంపై రెగ్యులర్ ఫీచర్ మూవీల్లో కొన్ని మంచి.. చెడు, అశ్లీల, భయానకమైన సీన్లు ఉంటున్నాయి. వీటిని ఎలా నియంత్రించడంపై సూచనలు కోరుతున్నాను. వీటిని ఎలా డీల్ చేయాలి. ఎవరూ మానిటర్ చేస్తారు. అసలు ఎవరు నియంత్రించాలి. ఓటీటీ ప్లాట్ ఫాంల మాదిరిగా న్యూస్ పోర్టల్స్ కూడా ఎలాంటి సర్టిఫికేషన్ లేదు’ అని జవదేకర్ చెప్పారు.

ఫ్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ ఛానళ్లను NBA మానిటర్ చేస్తుంటే, అడ్వర్టైజింగ్ కోసం అడ్వర్టైజింగ్ స్టాండర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. మూవీలను CBFC మానిటర్ చేస్తుంటుంది. కానీ, OTT ప్లాట్ ఫాంలను నియంత్రించే వ్యవస్థ లేదని తెలిపారు. అదే మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యే మూవీల్లో అయితే సెన్సార్ కటింగ్ ఉంటాయి.

అసభ్యకరమైన సన్నివేశాలను సీన్లను పరిశీలించి సెన్సార్ చేస్తుంటారు. OTT ప్లాట్ ఫాలపై మూవీ కంటెంట్‌ను పర్యవేక్షించేవారు లేరు. మూవీలో అశ్లీలత అలాగే ఉంటుంది. నెట్ ఫ్లెక్స్, అమెజాన్ ప్రైమ్ ప్లాట్ ఫాంలపై రిలీజ్ అయ్యే షోలపై కూడా సీబీఎఫ్ సీ మాదిరిగా నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. అంటే.. మీడియా స్వేచ్ఛను అడ్డుకోవాలనేది ప్రభుత్వం ఉద్దేశం కాదని జవదేకర్ స్పష్టం చేశారు.