మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి

స్మార్ట్ ఫోన్లు వచ్చాక రకరకాల యాప్స్ పుట్టగొడుగుల్లా వచ్చాయి. తమ పనులు ఈజీగా అయ్యేందుకు చాలామంది ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారు. అయితే, అందులో ఏది సురక్షితం, ఏది డేంజర్ అనే విషయం ఎవరికీ తెలీదు. ఇలాంటి వివరాలు ఏవీ తెలుసుకోకుండానే చాలామంది యాప్స్ ను డౌన్ లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత మూల్యం చెల్లించుకుంటున్నారు.

మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి

Apps

If Any Of These Apps Are On Your Phone, Delete Them Now: స్మార్ట్ ఫోన్లు వచ్చాక రకరకాల యాప్స్ పుట్టగొడుగుల్లా వచ్చాయి. తమ పనులు ఈజీగా అయ్యేందుకు చాలామంది ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారు. అయితే, అందులో ఏది సురక్షితం, ఏది డేంజర్ అనే విషయం ఎవరికీ తెలీదు. ఇలాంటి వివరాలు ఏవీ తెలుసుకోకుండానే చాలామంది యాప్స్ ను డౌన్ లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత మూల్యం చెల్లించుకుంటున్నారు.

కొన్ని యాప్స్ ఏ మాత్రం సేఫ్ కాదు. కొన్ని యాప్స్ మీ ఫోన్ ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు, పాస్ వర్డ్స్, ఆధార్, పాన్ నెంబర్స్ వంటి కీలకమైన సమాచారాన్ని సైబర్ క్రిమినల్స్ కు అందించే చాన్సుందని నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ లో సోషల్ మీడియా, మొబైల్ పేమెంట్స్ చేసే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

కాగా, గూగుల్ ప్లే స్టోర్ లో కొన్ని యాప్స్ చాలా డేంజర్ అని నిపుణులు గుర్తించారు. ఒకవేళ వాటిని ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే ఆండ్రాయిడ్ యూజర్లు వెంటనే వాటిని అన్ ఇన్ స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. అంతేకాదు, బ్యాంకు ఖాతాతో పాటు ఆర్థిక ఖాతాల పాస్ వర్డ్స్ ను వెంటనే మార్చేయాలని సూచించారు.

వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయాల్సిన 8 డేంజరస్ యాప్స్:
Cake VPN (com.lazycoder.cakevpns)
Pacific VPN (com.protectvpn.freeapp)
eVPN (com.abcd.evpnfree)
BeatPlayer (com.crrl.beatplayers)
QR/Barcode Scanner MAX (com.bezrukd.qrcodebarcode)
Music Player (com.revosleap.samplemusicplayers)
tooltipnatorlibrary (com.mistergrizzlys.docscanpro)
QRecorder (com.record.callvoicerecorder)