Jio Prepaid Recharge : వాట్సాప్‌‌‌ ద్వారా జియో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే..?

రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో అతి త్వరలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Jio Prepaid Recharge : వాట్సాప్‌‌‌ ద్వారా జియో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే..?

Jio Prepaid Recharge Through Whatsapp Soon

Whatsapp-Jio Prepaid Recharge : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో అతి త్వరలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఒకసారి ఫీచర్ వచ్చాక జియో ప్రీపెయిడ్ యూజర్లు ఈజీగా రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, సోషల్ దిగ్గజం మెటా (Facebook)తో టెలికం దిగ్గజం భాగస్వామ్యంలో ఈ కొత్త ఫీచర్ వాట్సాప్‌లో రానుంది.  జియో యూజర్లు తమ ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ను వాట్సాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించింది.

Meta’s Fuel for India 2021 ఈవెంట్‌లో Jio ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ వాట్సాప్ లో జియో రీచార్జ్ విధానంపై మాట్లాడారు. Jio, Meta బృందాలు పరస్పర సహకారంతో కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. వాట్సాప్‌లో జియో రీచార్జ్ ఆప్షన్ కూడా ఒకటిగా ఉండనుందని తెలిపారు. తద్వారా జియో యూజర్లు తమ ‘ప్రీపెయిడ్ రీఛార్జ్’ సులభంగా చేసుకోనేందుకు వీలుంటుంది. వాట్సాప్ లో అతి త్వరలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జియో యూజర్లకు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని అని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు.

2022లో జియో రీచార్జ్ ఫీచర్ :
జియో ప్రీపెయిడ్ రీచార్జ్ ఫీచర్ 2022లో లాంచ్ కానుంది. వాట్సాప్ లో రాబోయే ఈ ఫీచర్ ద్వారా జియో రీఛార్జ్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తుందని జియో (Jio) ప్లాట్‌ఫారమ్‌ల డైరెక్టర్ ఇషా అంబానీ (Isha Ambani) పేర్కొన్నారు. ప్రత్యేకించి కొన్ని సమయాల్లో వృద్ధులు బయటకు వెళ్లడం కష్టంగా ఉంటుందని, ఈ వాట్సాప్ ద్వారా జియో రీఛార్జ్ ఈజీగా చేసుకోవచ్చునని అన్నారు. ఎండ్-టు-ఎండ్ ఎక్స్ పీరియన్స్ అందించడంతో పాటు పేమెంట్స్ సామర్థ్యం కూడా అందిస్తోందని చెప్పారు. మిలియన్ల మంది జియో యూజర్ల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేయగలదని ఆశిస్తున్నట్టు ఆమె చెప్పారు. సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరి నాటికి రిలయన్స్ జియోకు 429.5 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఏప్రిల్ 2020లో మెటా.. జియో ప్లాట్‌ఫారమ్‌లలో USD 5.7 బిలియన్ల (రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ప్రకటించింది. WhatsApp కమ్యూనికేషన్ పేమెంట్స్ ప్లాట్‌ఫారమ్‌ను JioMartతో అనుసంధానమై వినియోగించుకోవచ్చునని తెలిపింది. భారత మార్కెట్లో మెరుగైన షాపింగ్, వాణిజ్యపరమైన అనుభవాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఇరుకంపెనీలు అభిప్రాయపడ్డాయి.

రిటైలర్లకు కొత్త అవకాశాలు అందించడమే.. :
ప్రస్తుతం జియోమార్ట్‌లో హాఫ్ మిలియన్లకు పైగా రిటైలర్లు ఉన్నారని, రానురాను వారి సంఖ్య పెరుగుతోందని ఆకాష్ అంబానీ అన్నారు. మెటాతో జియో భాగస్వామ్యం వాట్సాప్ టీమ్ సహకారంతో చాలా ప్రయోజనకరంగా మారిందని అంబానీ తెలిపారు. రిటైలర్‌లకు స్టాక్ పెంచడానికి, మార్జిన్‌లు మరింత మెరుగుపడేలా స్థానిక ఫీచర్‌లను రూపొందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో కస్టమర్లకు దగ్గరగా ఉంటామని ఆకాశ్ అంబానీ తెలిపారు. జియో యూజర్లు వాట్సాప్‌లోనే షాపింగ్ చేసేలా సేవలు అందించనున్నట్టు ఇషా అంబానీ అన్నారు. మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ ప్రకారం.. భారత్ అత్యంత వేగంగా మరెన్నో ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా మారుతోందని,  తద్వారా ఇతర దేశాలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. కరోనా ప్రభావిత ప్రపంచంలో చిన్నపాటి నుంచి పెద్ద వ్యాపారాలకు కొత్త అవకాశాలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. భారత్ అంతటా 63 మిలియన్లకు పైగా చిన్నతరహా వ్యాపారులు ఉన్నారని, వీరే ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఇషా అంబానీ పేర్కొన్నారు.

Read Also : WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!