Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు మోటరోలా నుంచి కొత్త X30 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోంది. Lenovo యాజమాన్యంలోని కంపెనీ Moto X30 కెమెరా ఫోన్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Moto X30 Pro Camera Details Revealed Ahead Of Official Launch (1)

Moto X30 Pro Camera : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు మోటరోలా నుంచి కొత్త X30 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోంది. Lenovo యాజమాన్యంలోని కంపెనీ Moto X30 కెమెరా ఫోన్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Moto X30 Pro చైనీస్ మార్కెట్‌లో లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ సెన్సార్‌కు సంబంధించి వివరాలను లెనోవా ఎగ్జిక్యూటివ్ షేర్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రకారం.. మోటరోలా 1/1.22-అంగుళాల సెన్సార్‌ను వినియోగిస్తోంది. శాంసంగ్ 200-MP ISOCELL HP1 సెన్సార్ కావచ్చు. అయితే, లెనోవో మొబైల్ చైనా జనరల్ మేనేజర్ చెన్ జిన్ ఫోన్ కెమెరా సెన్సార్ గురించి కీలక వివరాలను వెల్లడించారు.

Moto X30 1/1.22-అంగుళాల సెన్సార్‌, ప్రాథమిక కెమెరాతో వస్తుందని జిన్ వీబోలో పోస్ట్ చేసారు. శాంసంగ్ ISOCELL 200-MP సెన్సార్‌గా ఉంటుందో లేదో వెల్లడించలేదు. చెన్ జిన్ సైజులోనే ఉంటుంది. నివేదికల ప్రకారం.. Motorola Edge 30 Ultra లేదా ఫ్రాంటియర్, 125W ఫాస్ట్ ఛారింగ్ సపోర్ట్‌తో రానున్న మొదటి ఫోన్ కానుంది. ఈ Moto X30 Pro లాంచ్ జూలైలో ఉంటుందని సమాచారం. గతంలో.. Lenovo గ్రూప్ చైనా CEO చెన్ జిన్ Weibo హ్యాండిల్‌లో సుమారు 130 గ్రాముల బరువున్న Motorola 125W ఛార్జింగ్ అడాప్టర్ షేర్ చేశారు. 125 ఫాస్ట్ ఛార్జర్‌కు ఏ మోటరోలా ఫోన్ సపోర్టు అందిస్తుందో చెన్ జిన్ వెల్లడించలేదు.

Moto X30 Pro Camera Details Revealed Ahead Of Official Launch

Moto X30 Pro Camera Details Revealed Ahead Of Official Launch

ఇంతకుముందు.. లెనోవా గ్రూప్ రెండు ఫ్లాగ్‌షిప్ మోడళ్లను లాంచ్ చేస్తుందని అంచనా వేసింది. అయితే ఒకటి మోటరోలా కింద లాంచ్ అవుతుందని, మరొకటి మోటరోలా బ్రాండింగ్‌తో రావచ్చని టిప్‌స్టర్ వెల్లడించారు. Motorola ఫ్రాంటియర్ 125W ఫాస్ట్ ఛార్జర్, 200-MP కెమెరా, Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో రానుందని కంపెనీ సూపర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ అంటూ పుకార్లు వచ్చాయి. మోటరోలా ఫ్రాంటియర్ 22 వివరణాత్మక స్పెసిఫికేషన్లలో కెమెరా ఫీచర్ ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది. Motorola ఫ్రాంటియర్ 200-MP సెన్సార్‌తో పాటు 50-MP సెన్సార్, 12-MP సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 60-MP కెమెరా ఉండే అవకాశం ఉంది.

Read Also : Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?