OnePlus 10T : 2022లో వన్‌ప్లస్ నుంచి చివరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదే..!

OnePlus 10T : వన్‌ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఇప్పటికే ఆ స్మార్ట్ ఫోన్ మోడల్ ఏంటో కూడా కంపెనీ నిర్ణయించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

OnePlus 10T : 2022లో వన్‌ప్లస్ నుంచి చివరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదే..!

Oneplus 10t Tipped To Be The Last Flagship Phone From Oneplus In 2022

OnePlus 10T : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఇప్పటికే ఆ స్మార్ట్ ఫోన్ మోడల్ ఏంటో కూడా కంపెనీ నిర్ణయించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వన్‌ప్లస్ 10T (OnePlus 10T) పేరుతో మార్కెట్లోకి రానుంది. టిప్‌స్టర్ మ్యాక్స్ జాంబోర్ ప్రకారం.. OnePlus 10T ఈ ఏడాది చివర్లో లాంచ్ కానుందని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. 2022లో వన్ ప్లస్ నుంచి రాబోయే చివరి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా కూడా ఇదే కానుందని తెలిపారు. గత కొంతకాలంగా వన్ ప్లస్ నుంచి ఈ సిరీస్‌లో అల్ట్రా వేరియంట్ ఏదీ రిలీజ్ కాలేదు. సాధారణంగా ప్రతి ఏడాది ప్రారంభంలో OnePlus తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తుంటుంది. ఈ ఏడాది చివరి నాటికి T సిరీస్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. కంపెనీ నుంచి వచ్చిన చివరి T సిరీస్ ఫోన్లలో OnePlus 8T సిరీస్ కానుంది. 2020లోనే OnePlus 9T రిలీజైంది. మార్చి 2022లో అదే ఫ్లాగ్‌షిప్ OnePlus 10 Pro స్మార్ట్‌ఫోన్‌ను నిలిపివేసింది. ఈ ఏడాదిలో OnePlus ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లోని స్టాండర్డ్ వెర్షన్‌ను కూడా వన్ ప్లస్ ఆపేసింది.

Oneplus 10t Tipped To Be The Last Flagship Phone From Oneplus In 2022 (1)

Oneplus 10t Tipped To Be The Last Flagship Phone From Oneplus In 2022 

ప్రస్తుతానికి రూ. 45,000 లోపు OnePlus 10R, OnePlus 9RT స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే వన్‌ప్లస్ అందిస్తోంది. ఫ్లాగ్‌షిప్ OnePlus 10 Pro భారత మార్కెట్లో రూ. 66,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది. రాబోయే ఈ కొత్త 10T స్మార్ట్ ఫోన్ కంపెనీని ఎంత ధరకు అందుబాటులోకి తీసుకురానుందో క్లారిటీ లేదు. వన్ ప్లస్ 10ప్రో ఇప్పటికే ప్రీమియం ధరలో హైఎండ్ స్పెషిఫికేషన్లను అందిస్తోంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను అందించనుంది. కంపెనీ OnePlus 10T 10 ప్రో వెర్షన్ కన్నా తక్కువ ఖర్చు ఉండనుంది. బ్రాండ్ ఏమైనప్పటికీ T సిరీస్‌తో IP రేటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును అందించలేదు. రాబోయే OnePlus 10T స్పెసిఫికేషన్‌లు ఏంటో టిప్‌స్టర్ రివీల్ చేయలేదు. కానీ, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్, కొత్త స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ద్వారా పవర్ అందిస్తోంది.

ఇటీవలే రిలీజ్ అయిన OnePlus 10R స్మార్ట్‌ఫోన్‌ వేగవంతమైన ఛార్జింగ్ సపోర్టుతో వస్తుందని భావిస్తున్నారు. రాబోయే OnePlus 10T 80W లేదా 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో రావచ్చు. దీన్ని రీకాల్ చేయడానికి OnePlus 10R రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. అందులో ఒకటి 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. రెండవ మోడల్‌లో 120W ఛార్జింగ్‌కు సపోర్టు ఉన్న 4,500mAh యూనిట్ ఉంది. వాస్తవానికి OnePlus 10 సిరీస్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది.

Read Also : TikTok : టిక్‌టాక్ ఇండియాకు తిరిగి వస్తుందా? అదే ప్రయత్నాల్లో యాప్ యాజమాన్యం..!