BSNL 5G Services in India : 2023 ఆగస్టు 15న BSNL 5G లాంచ్.. వచ్చే మార్చి నాటికి 200 నగరాల్లో 5G సర్వీసులు!

BSNL 5G Services in India : భారతదేశంలో 5G సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశంలో 5G సర్వీసులను అధికారికంగా ప్రారంభించారు. వచ్చే ఆరు నెలల్లో 200కి పైగా భారతీయ నగరాల్లో 5G సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

BSNL 5G Services in India : 2023 ఆగస్టు 15న BSNL 5G లాంచ్.. వచ్చే మార్చి నాటికి 200 నగరాల్లో 5G సర్వీసులు!

Over 200 cities to get 5G by March 2023, BSNL to launch 5G on August 15 next year

BSNL 5G Services in India : భారతదేశంలో 5G సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశంలో 5G సర్వీసులను అధికారికంగా ప్రారంభించారు. వచ్చే ఆరు నెలల్లో 200కి పైగా భారతీయ నగరాల్లో 5G సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

ఢిల్లీలోని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే కేంద్ర మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel), Vodaphone Idea (Vi), రిలయన్స్ జియో (Reliance Jio) వంటి టెల్కోలు వినియోగదారుల లభ్యత తేదీలు, ధరలను ఇంకా ప్రకటించలేదు. కనీసం ఎయిర్‌టెల్, జియో తమ 5G సర్వీసులను ఈ నెలలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని మంత్రి చెప్పారు.

Over 200 cities to get 5G by March 2023, BSNL to launch 5G on August 15 next year

Over 200 cities to get 5G by March 2023, BSNL to launch 5G on August 15 next year

IMC 2022లో IT మంత్రి అశ్విని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) దేశంలో సొంత 5G సర్వీసులను 2023 ఆగస్టు 15న ప్రారంభించనుందని తెలిపారు. 5G సర్వీసుల ధరను ఎలా నిర్ణయిస్తుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. రిలయన్స్ జియో భారత మార్కెట్లో చౌకైన ధరకే 5G సర్వీసులను అందిస్తామని హామీ ఇచ్చింది.

నివేదిక ప్రకారం.. కేంద్ర మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. రాబోయే ఆరు నెలల్లో, 200కి పైగా నగరాల్లో 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రాబోయే రెండేళ్లలో దేశంలోని 80-90 శాతంలో 5G సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.

Over 200 cities to get 5G by March 2023, BSNL to launch 5G on August 15 next year

Over 200 cities to get 5G by March 2023, BSNL to launch 5G on August 15 next year

BSNL వచ్చే ఏడాది ఆగస్ట్ 15 నుంచి 5G సర్వీసులను అందించనుంది. 5G నెట్‌వర్క్ కూడా అందుబాటులో ఉంటుంది. అనేక కీలక వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. రాబోయే నాలుగు రోజుల్లో INC 2022 సమయంలో ప్రభుత్వం, ప్రైవేట్ ప్లేయర్ల నుంచి మరింత 5G సర్వీసులకు సంబంధించి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటివరకు, Jio దీపావళి (అక్టోబర్ 23-24) నాటికి దాని 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. నాలుగు ప్రధాన నగరాల్లో.. ఎయిర్‌టెల్ 5G సర్వీసులు ఈ రోజు నుంచి అందుబాటులో వచ్చాయి. దీనికి సంబంధించి మరింత టెస్టింగ్ చేసే అవకాశం ఉందని తెలిపింది. ఎయిర్‌టెల్ తన 5G సర్వీసులను మొదటి దశలో 8 నగరాల్లో అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. కానీ, వోడాఫోన్ ఐడియా (Vi) మాత్రం తమ 5G సర్వీసులపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G Services : భారత్‌లో ఆ 8 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి!