Mobile in silent mode : సైలెంట్‌లో ఉన్న ఫోన్ కనిపించకపోతే ఏం చేయాలి?

సెల్ ఫోన్ కొనగానే సరిపోదు.. అది పోగొట్టుకుంటే, సైలెంట్‌లో పెట్టి ఎక్కడైనా మర్చిపోతే అప్పుడు ఏం చేయాలనేది తెలుసుకోవాలి. ముందుగానే ఫోన్లో ఎలాంటి ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలనే అవగాహన కూడా ఉండాలి. మీ ఫోన్ సైలెంట్‌లో ఉండి కనిపించకపోతే ఏం చేయాలి?

Mobile in silent mode : సైలెంట్‌లో ఉన్న ఫోన్ కనిపించకపోతే ఏం చేయాలి?

Mobile in silent mode

Updated On : July 16, 2023 / 10:46 AM IST

Mobile in silent mode : ఒక్కోసారి ఫోన్ సైలెంట్‌లో పెట్టి తీయడం మర్చిపోతాం. సోఫా క్రింద పెట్టి మర్చిపోవచ్చు. బట్టల మధ్యలో పడిపోవచ్చు. గంటలకొద్దీ వెతికినా ఫోన్ కనిపించదు. ఇల్లు పీకి పందిరి వేసినా కష్టం. అలాంటి పరిస్థితి నుంచి ఫోన్‌ను కనిపెట్టడం ఎలా?. మీ ఫోన్ కనిపించకుండా పోయినా దాన్ని లాక్ చేయచ్చు. రింగ్ అయ్యేలా చేయచ్చు. మొత్తం డేటాను తొలగించవచ్చు. ఎలా?

Poco C51 Discount : ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌పై రూ. 2500 తగ్గింపు ధరతో పోకో C51 ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు..!

మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్కడ పెట్టారో లొకేషన్ తెలుసుకోవాలంటే ముందుగా ఇంటర్నెట్ అవసరం. మీ ఇంట్లో WiFi లేదా 3G డేటా ఉపయోగించే ఫోన్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయగలిగితే మీ ఫోన్ కనుక్కోవడం ఈజీ అవుతుంది. మీ ఫోన్ ఎక్కడ ఉందో కనుగొనాలనుకున్నప్పుడు గూగుల్ ఓపెన్ చేసి  Find My Phone కోసం వెతకాలి. మీ గూగుల్ ఖాతా వివరాలతో లాగిన్ అయితే చిన్న మ్యాప్‌తో పేజీలో చిన్న ఫ్రేమ్ కనిపిస్తుంది. అది మీ మొబైల్ లొకేషన్‌ని నిర్ధారిస్తుంది. అంతేకాదు రిమోట్‌గా రింగ్ చేసే అవకాశం ఇస్తుంది. రింగ్ బటన్‌పై క్లిక్ చేసిన తరువాత మీరు సైలెంట్‌లో ఉంచిన ఫోన్ 5 నిముషాలు ఫుల్ వాల్యూమ్‌తో రింగ్ అవుతుంది. మీరు ఫోన్ గుర్తించిన తర్వాత రింగ్ ఆపడానికి పవర్ బటన్ నొక్కాలి.

OnePlus First Folding Phone : ఆగస్టు 29న వన్‌ప్లస్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

ఇక సైలెంట్ మోడ్‌లో ఉన్న మీ ఫోన్ రింగ్ అవ్వడానికి అనేక యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ముందుగానే వాటిని డౌన్ లోడ్ చేసుకుని సెట్టింగ్స్‌లో వాటిని కనెక్ట్ చేసుకుంటేనే వాటి ద్వారా సైలెంట్‌లో ఉన్న మన ఫోన్‌ను కనిపెట్టగలం. ఆండ్రాయిడ్ ఫోన్ కొనగానే సరిపోదు.. అది ఒకవేళ పోగొట్టుకున్నా,  సైలెంట్‌లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా ఏం చేయాలనే టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం.