OnePlus First Folding Phone : ఆగస్టు 29న వన్‌ప్లస్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

OnePlus First Folding Phone : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే ఆగస్టు 29న భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ Z Fold 5, Galaxy Z Flip 5 లాంచ్ అయిన నెల తర్వాత వన్‌ప్లస్ రానుంది.

OnePlus First Folding Phone : ఆగస్టు 29న వన్‌ప్లస్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

OnePlus may launch its first folding phone on August 29, here is what to expect

OnePlus First Folding Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) ఫస్ట్ ఫోల్డబుల్ డివైజ్‌ను రాబోయే నెలల్లో లాంచ్ చేయనుంది. గతంలో పుకార్ల ప్రకారం.. OnePlus V ఫోల్డ్‌కు బదులుగా కంపెనీ డివైజ్‌ను (OnePlus One) అనే పేరుతో రిలీజ్ చేయనుంది. కంపెనీ అధికారిక నిర్ధారణకు ముందు నివేదిక ఈ విషయాన్ని రివీల్ చేసింది. OnePlus ఫోల్డింగ్ ఫోన్ ఆగస్ట్ 29న లాంచ్ కానుంది. Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 లాంచ్ అయిన నెల తర్వాత వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ రాబోతోంది.

గత నెలలో అదే పబ్లికేషన్ లీకైన డిజైన్ ఆధారంగా OnePlus One లేదా V ఫోల్డ్ రెండర్‌లను ప్రచురించింది. వన్‌ప్లస్ ఫోల్డింగ్ ఫోన్ Galaxy Z Fold 4, Google Pixel Fold మాదిరిగానే నోట్‌బుక్ లాంటి ఫారమ్ ఫ్యాక్టర్‌ని కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుందా? అనేది అస్పష్టంగానే ఉంది. వన్‌ప్లస్ సిస్టర్ బ్రాండ్, Oppo, BBK గ్రూప్ కింద ఇప్పటికే Oppo Find N2 ఫ్లిప్‌ను అందిస్తోంది. రెండర్‌లు లెదర్ బ్యాక్, స్లిమ్ బెజెల్స్‌తో కూడిన టీజ్ చేస్తాయి. ఎక్స్‌ట్రనల్ డిస్‌ప్లేతో పాటు సెల్ఫీ కెమెరా సెంటర్ హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది.

Read Also : Amazon Prime Day 2023 Sale : అమెజాన్‌లో షావోమీ, వన్‌ప్లస్, శాంసంగ్, ఆపిల్ ఐప్యాడ్, ట్యాబ్‌లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. మీకు నచ్చిన డివైజ్ కొనేసుకోండి!

మెయిన్ డిస్‌ప్లేలో మరో సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఫోన్ బ్యాక్ సైడ్ హాసెల్‌బ్లాడ్ ట్యూన్‌తో 3 కెమెరా సెన్సార్‌లు ఉండవచ్చు. కెమెరా వన్‌ప్లస్ 11లో ఉన్నటువంటి రౌండ్ మాడ్యూల్ లోపలికి రావచ్చు. LED ఫ్లాష్ ప్లేస్‌మెంట్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. రెండర్‌లు టాప్-లెఫ్ట్ సైడ్ LED లైట్లతో రానుంది. సాధారణ స్మార్ట్‌ఫోన్‌లు కెమెరా మాడ్యూల్ లోపల లేదా వెలుపల ఫ్లాష్‌ను కలిగి ఉంటాయి. కెమెరా మాడ్యూల్ కింద వన్‌ప్లస్ లోగో ఉంటుంది.

OnePlus may launch its first folding phone on August 29, here is what to expect

OnePlus may launch its first folding phone on August 29, here is what to expect

పవర్ బటన్‌తో మరో ముఖ్యమైన మార్పు ఉండవచ్చు. పవర్ బటన్ బాడీ డిజైన్‌లో కలిసిపోయేలా ఉందని రెండర్‌లు సూచిస్తున్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫింగర్ ఫ్రింట్ స్కానర్ కూడా ఉండవచ్చు. బ్యాక్ కెమెరాలలో ఒకటి పెరిస్కోప్ కటౌట్ లోపల ఉండనుంది. వన్‌ప్లస్ కూడా వన్‌ప్లస్ 12లో ఇలాంటి కెమెరాను ఉపయోగించే అవకాశం ఉంది. స్పెసిఫికేషన్ల పరంగా OnePlus One లేదా OnePlus V ఫోల్డ్ ఇంకా ప్రకటించలేదని చెప్పవచ్చు. Snapdragon 8+ Gen 2 SoC, 2K 120Hz AMOLED (LTPO) డిస్‌ప్లే, 100W SuperVOOC ఛార్జింగ్‌తో కూడిన 4800mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందించవచ్చు. వన్‌ప్లస్ ఫోన్‌లలో అరుదైన ఫీట్ అని చెప్పవచ్చు. వన్‌ప్లస్ వన్ లేదా వన్‌ప్లస్ V ఫోల్డ్ ధర అస్పష్టంగానే ఉంది. అయితే, ఈ ఫోన్ ధర రూ. 1 లక్ష కన్నా ఎక్కువ ఉంటుందని భావించవచ్చు. ప్రస్తుతం, Samsung Galaxy Z ఫోల్డ్ సిరీస్‌తో ఫోల్డింగ్ ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. భారత మార్కెట్లో శాంసంగ్ ఫోల్డింగ్ ఫోన్ బేస్ 256GB వేరియంట్ ధర రూ.1,54,999 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : Motorola Razr 40 Sale : అమెజాన్‌ ప్రైమ్ డే సేల్.. మడతబెట్టే మోటోరోలా Razr 40 సిరీస్‌పై రూ. 7వేలు ప్లాట్ డిస్కౌంట్.. మరెన్నో లాంచ్ ఆఫర్లు.. డోంట్ మిస్..!