Vodafone Idea 5G Services : భారత్‌లో 4G కన్నా రాబోయే 5G సర్వీసు చాలా కాస్ట్ లీ గురూ.. ఎందుకో తెలుసా?

Vodafone Idea 5G Services : భారత‌లోకి అతి త్వరలోనే 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు 5G నెట్ వర్క్ సేవల అమలుకు సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

Vodafone Idea 5G Services : భారత్‌లో 4G కన్నా రాబోయే 5G సర్వీసు చాలా కాస్ట్ లీ గురూ.. ఎందుకో తెలుసా?

Vodafone Idea expects 5G services to cost more than 4G, here is why

Vodafone Idea 5G Services : భారత‌లోకి అతి త్వరలోనే 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు 5G నెట్ వర్క్ సేవల అమలుకు సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దేశీయ టెలికం దిగ్గజాల్లో భారతీయ ఎయిర్ టెల్ (Airtel 5G Services) ఒక అడుగు ముందుకేసి ఆగస్టు నెలాఖరులోనే 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఈ 5G సేవలకు సంబంధించి వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) సీఈఓ రవీందర్ టక్కర్ (Ravinder Takkar) పలు అంశాలను వెల్లడించారు. దేశంలో 5G ప్లాన్‌ల ధరలు 4G కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఒక నివేదిక తెలిపింది.

రాబోయే 5G ప్లాన్‌లు ప్రీమియం ధరలో లభిస్తే.. :

4G ప్లాన్‌ల ధరలు నవంబర్ 2021లో భారీగా పెరిగాయని, ఇప్పుడు రాబోయే 5G ప్లాన్‌లు ప్రీమియం ధరలో లభిస్తే మాత్రం.. 5G వినియోగదారులు మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని వోడాఫోన్ ఐడియా (Vi) అంచనా వేసింది. ప్రస్తుతానికి రాబోయే 5G సేవల ధర భారత్‌లో ఎంత ఉంటుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. Vodafone Idea CEO దీనికి సంబంధించిన వివరాలను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు ఇటీవల నిర్వహించిన వేలంలో స్పెక్ట్రమ్‌లను కొనుగోలు చేసేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయని ఆయన అన్నారు. అందుకే 5G సేవలు తక్కువ ధరకు అందుబాటులో ఉండకపోవచ్చునని టక్కర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ ఫోన్ సేవలపై మొత్తం టారిఫ్ పెరగవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.

Vodafone Idea expects 5G services to cost more than 4G, here is why

Vodafone Idea expects 5G services to cost more than 4G, here is why

“స్పెక్ట్రమ్‌పై సరసమైన మొత్తంలో ఖర్చు చేసామని, 5Gకి 4Gకి ప్రీమియం ధర నిర్ణయించాల్సి ఉందన్నారు. అది ఎంత అనేది ప్రీమియంతో ధర నిర్ణయించవచ్చునని చెప్పారు. ఆ ప్రీమియంతో మీరు 5Gలో పొందే అదనపు బ్యాండ్‌విడ్త్‌ను బట్టి.. మీరు పొందే గిగాబైట్ల సంఖ్య ఎక్కువగా కలిగి ఉండవచ్చు. ప్రీమియం ధరతో యూజర్లు కూడా ఎక్కువ డేటాను పొందవచ్చని ఆయన చెప్పారు. కానీ, 4G యూజర్లు డెవలప్ చేసిన వినియోగ కేసులపై ఇది ఆధారపడి ఉంటుంది. 18,800 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను వోడాఫోన్ ఐడియా కొనుగోలు చేసినట్లు సమాచారం.

వినియోగదారులకు వేగవంతమైన అనుభవాన్ని అందించడానికి వోడాఫోన్ 3,300MHz మరియు 26Ghz 5G బ్యాండ్‌లను కొనుగోలు చేసింది. 17 ప్రాధాన్యతా సర్కిల్‌లలో మిడ్-బ్యాండ్ 5G స్పెక్ట్రమ్ (3300 MHz బ్యాండ్), 16 సర్కిల్‌లలో mmWave 5G స్పెక్ట్రమ్ (26 GHz బ్యాండ్)ని విజయవంతంగా పొందినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికాం దిగ్గజం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కర్ణాటక, పంజాబ్‌తో సహా మూడు ప్రదేశాలకు అదనంగా 4G స్పెక్ట్రమ్‌ను పొందింది. 4G సేవల ధరల పెరుగుదలతో ఆదాయ పరంగా కొంత నష్టాన్ని పూడ్చగలిగిందని, ఈ ఏడాది చివరిలో మళ్లీ అదే జరుగుతుందని ఆశిస్తున్నట్లు టక్కర్ భావిస్తున్నారు.

Read Also : 5G Services In India: అక్టోబర్ నుంచి 5జీ సేవలు.. అందుబాటులోనే ఛార్జీలు: టెలికాం మంత్రి అశ్విని