Vodafone Idea : ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కోసం వోడాఫోన్ ఐడియా కొత్త రోమింగ్ ప్లాన్లు.. మరెన్నో బెనిఫిట్స్.. ఏయే ప్లాన్ ధర ఎంతంటే?

Vodafone Idea : FIFA ప్రపంచకప్ 2023 ఫీవర్ కొనసాగుతోంది. ప్రపంచమంతా ఫుట్‌బాల్ అభిమానులు అభిమాన జట్ల మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇదే సమయాన్ని ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా Vodafone Idea (Vi) ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌తో కలిసి FIFA ప్రపంచ కప్ వీక్షించేందుకు సరికొత్త ఆఫర్లను అందిస్తోంది.

Vodafone Idea : ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కోసం వోడాఫోన్ ఐడియా కొత్త రోమింగ్ ప్లాన్లు.. మరెన్నో బెనిఫిట్స్.. ఏయే ప్లాన్ ధర ఎంతంటే?

Vodafone Idea launches new roaming plans for football fans_ price, benefits and more

Vodafone Idea : FIFA ప్రపంచకప్ 2023 ఫీవర్ కొనసాగుతోంది. ప్రపంచమంతా ఫుట్‌బాల్ అభిమానులు అభిమాన జట్ల మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇదే సమయాన్ని ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా Vodafone Idea (Vi) ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌తో కలిసి FIFA ప్రపంచ కప్ వీక్షించేందుకు సరికొత్త ఆఫర్లను అందిస్తోంది.

టెలికాం ఆపరేటర్ లైవ్-యాక్షన్ ఫుట్‌బాల్‌ను చూసేందుకు ఖతార్‌కు వెళ్లే యూజర్ల కోసం ప్రత్యేక అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను ప్రకటించింది. గ్లోబల్ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా (Vi) ద్వారా అందిస్తోంది. FIFA వరల్డ్ కప్ 2022 కోసం కొన్ని ప్రత్యేకమైన అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను ప్రారంభించింది.

అందులో IR ప్యాక్‌లు రూ. 2,999 నుంచి ప్రారంభమయ్యే ఏడు రోజుల నుంచి 28 రోజుల ప్యాక్ వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ IR ప్యాక్‌లు హై-స్పీడ్ డేటాను అందిస్తున్నాయి. ఈ ప్యాక్‌లు అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్ కాలింగ్, అవుట్‌గోయింగ్ టు ఇండియా, SMS వంటి కనెక్టివిటీ సమస్యలు లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించడానికి, మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమ్ చేసేందుకు, సోషల్ మీడియాలో స్నేహితులతో అన్నింటిని షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

FIFA వరల్డ్ కప్ 2022 కోసం ఖతార్‌కు వెళ్లే యూజర్ల కోసం లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ ప్యాక్‌లను ప్రత్యేకంగా ప్రారంభించింది. ఫుట్‌బాల్ గేమ్, సెలవుల కోసం ఖతార్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారుల కోసం Vi నుంచి ప్రత్యేకమైన IR ప్యాక్‌ల లిస్టును అందిస్తోంది.

Vodafone Idea launches new roaming plans for football fans_ price, benefits and more

Vodafone Idea launches new roaming plans for football fans_ price, benefits

వోడాఫోన్ ఐడియా IR FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 ప్యాక్ మీకోసం :

Vi రూ 2999 IR ప్లాన్ : 7 రోజుల వ్యాలిడిటీతో ఈ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ 2GB డేటాతో పాటు భారత్‌కు 200 నిమిషాల లోకల్, అవుట్‌గోయింగ్ కాల్‌లు, 25 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్ కాల్‌లు, అవుట్‌గోయింగ్ కాల్‌లు మరే ఇతర దేశానికైనా నిమిషానికి రూ. 35ల వరకు ఛార్జ్ చేస్తుంది.

Vi రూ 3,999 IR ప్లాన్ : 10 రోజుల వ్యాలిడిటీపై ఈ IR ప్యాక్‌లో 3GB డేటా, 300 నిమిషాల లోకల్, అవుట్‌గోయింగ్ కాల్స్ ఇండియాకు చేసుకోవచ్చు. 50 SMS, ఉచిత ఇన్‌కమింగ్ కాల్, ఇతర దేశాలకు నిమిషానికి రూ. 35కి అవుట్‌గోయింగ్ కాల్‌లు చేసుకోవచ్చు.

Vi రూ. 4,499 IR ప్లాన్ : వోడాఫోన్ ఐడియా యూజర్లు 5GB డేటా, భారత్‌లో 500 నిమిషాల లోకల్, అవుట్‌గోయింగ్ కాల్‌లు, ఉచిత ఇన్‌కమింగ్ కాల్‌లు, 100 SMS, అవుట్‌గోయింగ్ కాల్‌లను నిమిషానికి రూ. 35 చొప్పున పొందవచ్చు. ప్రతిదీ 14 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు.

Vi రూ. 5,999 IR ప్లాన్ : ఈ ప్యాక్‌లో 5GB డేటా, 500 నిమిషాల లోకల్, అవుట్‌గోయింగ్ కాల్స్ ఇండియాకు, 100 SMS పొందవచ్చు. ఇతర దేశాలకు నిమిషానికి రూ. 35 చొప్పున 28 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్, అవుట్‌గోయింగ్ కాల్‌లు పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vodafone Idea Users : అతి త్వరలో వోడాఫోన్ ఐడియా యూజర్లకు 5G సర్వీసులు.. గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా