మోడీ హెడ్‌లైన్ పెట్టారు.. సీతారామన్ పూర్తి చేస్తారు: చిదంబరం

  • Published By: Subhan ,Published On : May 13, 2020 / 05:31 AM IST
మోడీ హెడ్‌లైన్ పెట్టారు.. సీతారామన్ పూర్తి చేస్తారు: చిదంబరం

మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రధానమంత్రి మోడీ విడుదల చేసిన ప్యాకేజీపై విమర్శలు చేశారు. లాక్‌డౌన్ కారణంగా పడిపోయిన ఇండియన్ ఎకానమీని ఆదుకోవడానికి మంగళవారం సాయంత్రం రూ.20లక్షల కోట్లు విడుదల చేశారు. దీనిని చిదంబరం.. హెడ్‌లైన్ అండ్ బ్లాంక్ పేజి అని అభివర్ణించారు. 

వరుస ట్వీట్లు చేసిన చిదంబరం.. ‘నిన్న ప్రధాని హెడ్‌లైన్ పెట్టి బ్లాంక్ పేజీ వదిలిపెట్టారు. మరో సారి నా రియాక్షన్ బ్లాంక్ గా వదిలిపెట్టేశా’ అని ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ 4 గురించి మాట్లాడిన మోడీ మెగా రిలీఫ్ ప్యాకేజీ గురించి చెప్తూ  దాని పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని చెప్పారు. 

‘ఇవాళ ఆర్థిక మంత్రి బ్లాంక్ పేజి పూర్తి చేస్తారనుకుంటున్నా. ఎకానమీ కోసం ప్రతి ఒక్క రూపాయి చాలా జాగ్రత్తగా లెక్కపెడదాం. అదెవరెవరికి ఎంత కేటాయిస్తారో కూడా చూస్తాం’ అని చిదంబరం అన్నారు. పలు రాష్ట్రాల నుంచి వేల మంది వలస కార్మికులు కాలి నడకన వస్తున్న వారి గురించి చిదంబరం ట్వీట్ చేశారు. 

‘ముందు మనం గుర్తించాల్సింది పేదవాళ్లకు ఏం కావాలి, ఆకలి ఎట్లా తీరుతుంది, వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడిచిన తర్వాత తర్వాత వాళ్లకు ఏం కావాలి. పేదరికానికి దిగువన ఉన్న 13 కోట్ల మంది పరిస్థితి కూడా చూడాలి. వాళ్ల దగ్గర నగదు ఎంతుందో చూసుకోవాలి’ అని అన్నారు. 

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ డైరక్ట్‌గా పేదల అకౌంట్లకు డబ్బులు ట్రాన్సఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, సీపీఐ(ఎమ్) నాయకులు వలస కార్మికుల పరిస్థితి పట్ల సైలెంట్ గా వ్యవహరించారంటూ విమర్శలు గుప్పించారు. 

Read Here>> లాక్‌డౌన్ 4: మే 18 నుంచి.. కొత్తగా అమలు