లిప్ట్ లన్నీ ఏడాదిన్నరలో పూర్తి, లేకపోతే..వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం – సీఎం కేసీఆర్

లిప్ట్ లన్నీ ఏడాదిన్నరలో పూర్తి, లేకపోతే..వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం – సీఎం కేసీఆర్

CM KCR Public Meeting : టీఆర్ఎస్ అంటే వీరుల పార్టీ…వీపు చూపించే పార్టీ కాదు…నా హామీలన్నీ పూర్తి చేసే బాధ్యత నాయకులదే…లిప్ట్ ల పనులన్నీ పూర్తి చేయకపోతే..వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని సీఎం కేసీఆర్ వెల్లడించారు. లిప్ట్ లన్నీ ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని ఛాలెంజ్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. గత పాలకులు పోడు భూముల సమస్యలని పెండింగ్ లో పెట్టారని, త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామన్నారు. నెల్లికల్లు భూ నిర్వాసితుల సమస్యలను రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.

రెండు రోజుల్లో పట్టాలిస్తామన్నారు. ఎడమకాల్వ ఆయుకట్టు కింద ప్రతి ఎకరానికి నీరిచ్చే బాధ్యత నాదే అని చెప్పడం జరిగిందని, నెల్లికల్లు పరిసర గ్రామాల కోసం రూ. 2500 కోట్లతో లిప్ట్ ఇరిగేషన్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, పట్టభద్రుల మండలి ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. సాగర్ నియోజకవర్గం సిట్టింగ్ సీటు కావడంతో… ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నెల్లికల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం సాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.