MLA’s Trap Case : ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో మరో ట్విస్ట్..నిందితులు ఓ కేసులో విడుదల,మరోకేసులో అరెస్ట్

మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో మరో ట్విస్ట్ నెలకొంది..నిందితులు ఓ కేసులో విడుదల,మరోకేసులో అరెస్ట్ చేశారు పోలీసులు.

MLA’s Trap Case : ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో మరో ట్విస్ట్..నిందితులు ఓ కేసులో విడుదల,మరోకేసులో అరెస్ట్

MLA's trap case..Nandakumar and Ramachandra Bharati arrested again

MLA’s trap case : మొయినాబాద్ ఫామ్ హౌస్.. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. చంచల్‌ గూడ జైలు దగ్గర ఎమ్మెల్యే కొనుగోలు కేసు నిందితుల విడుదల కొత్త ట్విస్ట్‌కి చోటు చేసుకుంది. ఈకేసులో నిందితులు ఓ కేసులో విడుదల అయితే మరో కేసులో మాత్రం అరెస్ట్ అయ్యారు. ఎమ్మల్యే కొనుగోలు కేసులో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌లు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌, రామచంద్రభారతిలను బంజారా హిల్స్‌ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఓ కేసులో విడుదల అయినా వారు బయటకు రావటానికి వీల్లేకుండాపోయింది. మరోకేసులో అరెస్ట్ చేయటంతో తిరిగి పోలీసులు వారిని మరోసారి అదుపులోకి తీసుకున్నారు.

మరో కేసులో నందకుమార్‌ నిందితుడిగా ఉన్నారనే విషయం తెలిసిందే. అదే ఫోర్జరీ కేసు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నందకుమార్‌పై ఫోర్జరీ, చీటింగ్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే ప్రలోభాల కేసులో విడుదల అయినా ఫోర్జరీ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉండటంతో ఈ అరెస్ట్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. నలభై రోజుల నుంచి జైల్లో ఉంటున్నామని ఈ అరెస్ట్ లేంటో అర్థంకావట్లేదంటూ వాపోయారు నందకుమార్.

కాగా అక్రమ కట్టడాలను అద్దెకు ఇచ్చాడంటూ నందకుమార్ పై సయ్యద్ అయాబ్ ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అలాగే రామచంద్రభారితిపై నకిలీ పాస్ట్ పోస్ట్ వ్యవహరంలో కేసు నమోదు అయ్యింది. ఈ ఫిర్యాదును సిట్ ఆఫీసర్ ఏసీపీ గంగాధర్ చేయగా ఎమ్మెల్యే ప్రలోభాల కేసులో విడుదల అయినా నందకుమార్, రామచంద్రభారతిలను పైన పేర్కొన్న కేసులు పెండింగ్ ఉండటంతో మరోసారి అరెస్ట్ షురూ చేశారు పోలీసులు.