KCR National Party : BRS రెడీ టు రిలీజ్.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం

తెలంగాణ భవన్ చుట్టూ పెద్దఎత్తున పోటాపోటీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు గులాబీ నేతలు. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసిన అనంతరం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి నగర నేతలు పోటాపోటీ ఏర్పాట్లకు సిద్ధం అవుతున్నారు.

KCR National Party : BRS రెడీ టు రిలీజ్.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం

KCR National Party : కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు కౌంట్ డౌన్ దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు గులాబీ నేతలు. తెలంగాణ భవన్ లో రేపు నిర్వహించబోయే సమావేశ ఏర్పాట్లను ఎమ్మెల్సీ మధుసూదనా చారి పలువురు టీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. కేసీఆర్ జాయతీ పార్టీ ప్రకటన కోసం 283 మంది ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. దీంతో సమావేశం హాల్ లో సిట్టింగ్ ఏర్పాట్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రత్యేక ఆహ్వానితులు కూర్చునే రూమ్స్ లో వసతులు పరిశీలించారు టీఆర్ఎస్ నేతలు.

అటు తెలంగాణ భవన్ చుట్టూ పెద్దఎత్తున పోటాపోటీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు గులాబీ నేతలు. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసిన అనంతరం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి నగర నేతలు పోటాపోటీ ఏర్పాట్లకు సిద్ధం అవుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలంగాణ భవన్ లో రేపు జరిగే టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ పేరు మారుస్తూ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు గులాబీ బాస్ రెడీ అవుతున్నారు. ఈ సమావేశం కోసం నగరం మొత్తం గులాబీ నేతలు ఫ్లెక్సీలతో గులాబీమయం చేశారు. దేశ్ కీ నేత కేసీఆర్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటూ పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.