మున్సిపల్ ఫలితాలు : భైంసాలో ఎంఐఎం-బీజేపీ హోరాహోరీ

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపల్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలకు జరిగిన

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 06:17 AM IST
మున్సిపల్ ఫలితాలు : భైంసాలో ఎంఐఎం-బీజేపీ హోరాహోరీ

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపల్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలకు జరిగిన

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపల్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలకు జరిగిన ఎన్నికల్లో కారు జోరు స్పష్టంగా కనిపించింది. మెజార్టీ మున్సిపాలిటీల్లో గులాబీ గుబాళించింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో మాత్రం టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. అక్కడ టీఆర్ఎస్ ప్రభావం కనిపించలేదు. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే.

భైంసాలో ఎంఐఎం-బీజేపీ మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. భైంసాలో 7 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలిస్తే.. 6 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. భైంసాలో నువ్వా-నేనా అన్న రీతిలో బీజేపీ-ఎంఐఎం మధ్య వార్ నడుస్తోంది. అక్కడ గెలుపుని ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 

శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి వార్డుకు రెండు టేబుట్స్‌ను ఏర్పాటు చేశారు. మొద‌ట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభ‌జించి బండిల్‌గా కట్టి.. లెక్కిస్తుస్తారు.

120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లలో 12వేల 926 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి కూడా టీఆర్ఎస్ జోరు స్పష్టంగా కనిపించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలి బోణీ కొట్టింది టీఆర్ఎస్సే. తొలుత పరకాల, చెన్నూరు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చెన్నూరులో మొత్తం 18 వార్డులను దక్కించుకుంది. పరకాలలో మొత్తం 22 వార్డులు కైవసం చేసుకుంది.