Telangana : ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్
ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. ఐటీఐఆర్ ఫస్ట్ ఫేజ్ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిదులు ఏం చేసారో మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Telangana : ఐటీఐఆర్ ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. ఐటీఐఆర్ ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేయటం సరికాదన్నారు. మొదటి ఫేజ్ లో ఫలక్ నుమా నుంచి ఉందానగర్ కు డబ్లింగ్ రైల్వే లైన్ వేయాలని..ఉందా నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు నూతన రైల్ మార్గం వేసి ఎలక్ట్రిఫికేషన్ చేయాలని..దీనికి 85కోట్లు రూపాయలు కావాలని కేంద్రాన్ని తెలంగాణ కోరితేను కోరితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కానీ ఈ విషయంలో కేటీఆర్ చెప్పేవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. ఐటీఐఆర్ అంటే లక్షా 90వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కు ఇస్తుందా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం తన వంతుగా చేయాల్సిన పనులను చేయకుండా పదే పదే కేంద్రంపై ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదని సూచించిన రఘునందన్ ఇటీఐఆర్ కోసం వేయాల్సిన రైలు మార్గం ఎందుకు వేయలేదు?ఇమ్లిబన్ నుంచి ఫలక్ నుమాకు మెట్రో ఎందుకు రాలేదు ? అని ప్రశ్నించారు.దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంఐఎం పార్టీ నేతలు కూడా బాధ్యత వహించాలన్నారు.ఉందా నగర్ నుంచి మహబూబ్ నగర్ వరకు కేంద్ర ప్రభుత్వం డబ్లింగ్ చేసి ఎలక్ట్రిఫికేషన్ కూడా చేసిందని స్పష్టంచేశారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది కూడా చేయకుండా ఎదురు కేంద్రంపై ఆరోపణలు చేస్తోంది అంటూ మండిపడ్డారు. బీహెఈఎల్ చౌరస్తాను డెవలప్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని..
ఐటీఐఆర్ కోసం గత ప్రభుత్వం ఎంతనిధులు ఇవ్వాలో అంతకంటే ఎక్కువ నిధుల్ని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకొచ్చారు.అంతేకాదు ఫ్యాబ్ సిటీ నుంచి 6వందల ఎకరాల ఈ సిటీకి కేటాయించినా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందనీ..దీనికోసం 4వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.ఈ సిటీ లో ఎలక్ట్రానిక్ కంపెనీకి కాకుండా అమేజాన్ సంస్థకు స్థలం కేటాయించారన్నారు. ఐటీఐఆర్ పై బహిరంగచర్చకు రావాలంటూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఐటీఐఆర్ పై కేసీఆర్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. ఐటీఐఆర్ ను 2 విడతలుగా చేయాలని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఐటీఐఆర్ కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేయలేదన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మొదటి ఫేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం 2015లోనే రూ.85 కోట్లు విడుదల చేసిందని ఈ సందర్భంగా రఘునందన్ గుర్తు చేశారు. ఎలాంటి డీపీఆర్ లు ఇవ్వకుండా లేఖలు రాస్తే కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది?అని ప్రశ్నించారు.
ఐటీఐఆర్ ఫస్ట్ ఫేజ్ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిదులు ఏం చేసారో మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయనందుకే… ప్రోగ్రెస్ రిపోర్ట్.. డీపీఆర్ ఇవ్వనందుకే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుందని తెలిపారు. MIMకు పాతబస్తీ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదంటూ ఆరోపించారు. ఫలక్ నామా నుంచి శంషాబాద్ వరకూ కొత్త రైల్వేలైన్ (మెట్రో ) ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. కొత్త రైల్వేలైన్ కోసం డీపీఆర్ పూర్తి చేయకుండా, స్థలం సేకరించకుండానే కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు. కేంద్రానికి కేవలం ఉత్తరాలు రాస్తే కంపెనీలు రావని, డీపీఆర్ లు ఇస్తే పనులు ముందుకు సాగుతాయని రఘునందర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.