Raja Singh On Election Results : తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వస్తుంది-రాజాసింగ్

తెలంగాణ‌లోనూ యూపీ త‌ర‌హా ఫ‌లితాలే రిపీట్ అవుతాయ‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణలో బండి సంజయ్ రూపంలో బుల్డోజర్ ని..(Raja Singh On Election Results)

Raja Singh On Election Results : తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వస్తుంది-రాజాసింగ్

Raja Singh

Raja Singh On Election Results : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. 4 రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం… జనతా విజయంగా ఆయన అభివర్ణించారు. ఔర్ ఏక్ దక్కా… తెలంగాణ సర్కార్ పక్కా అని నినదించారు. తెలంగాణలోనూ యూపీ తరహా ఫలితాలే వస్తాయని రాజాసింగ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గూండాల రాజ్యాన్ని బీజేపీ పారదోలుతుందని రాజాసింగ్ అన్నారు. టీఆర్ఎస్ గూండాలు అత్యాచారాలకు తెగబడుతున్నారని ఆరోపించారు.(Raja Singh On Election Results)

తెలంగాణలో బండి సంజయ్ రూపంలో బుల్డోజర్ ని అమిత్ షా ఉంచారని రాజాసింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో మాఫియా మీద యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ ఎలా ఎక్కించారో.. తెలంగాణలో అదే విధంగా కుటుంబ పాలన మీద, అవినీతి మీద బుల్డోజర్ ఎక్కిస్తాం అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేసిన రాజాసింగ్.. తెలంగాణలో ఒక్క గూండా కూడా ఉండడని చెప్పారు.(Raja Singh On Election Results)

UP Congress : ప్చ్ ప్రియాంక..! కాంగ్రెస్ ఓటమికి కారణాలివే..!

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తి కావ‌స్తోంది. ఐదింటిలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ క్లియ‌ర్ మెజారిటీతో అధికార ప‌గ్గాలు చేజిక్కించుకునే అవ‌కా‌శాలు క‌నిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విక్ట‌రీ ఖ‌రారైపోయింది. ఈ ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సహం నింపాయి. మ‌రో ఏడాదిలో జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై రాజాసింగ్ జోస్యం చెప్పారు. తెలంగాణ‌లోనూ యూపీ త‌ర‌హా ఫ‌లితాలే రిపీట్ అవుతాయ‌ని ఆయ‌న అన్నారు.

”యూపీలో దౌర్జన్యాలు, అన్యాయాలపై యోగి ఆదిత్యనాథ్‌ ఉక్కుపాదం మోపారు. అంతేకాకుండా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు. ఈ కార‌ణంగానే యోగి గెలవాలని యావత్ భారత్ కోరుకుంది. తెలంగాణలో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి” అని రాజాసింగ్‌ అభిప్రాయప‌డ్డారు.

సీఎం కేసీఆర్ కి కలలోకి కూడా మోదీ వస్తున్నార‌ని.. నిద్ర‌లోనూ కేసీఆర్‌ ఉలిక్కిపడుతున్నార‌ని రాజాసింగ్‌ ఎద్దేవా చేశారు. ఇక దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, తెలంగాణలోనూ ఈసారి ఆ పార్టీ ఖతం అవుతుందని రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. దీంతో హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం దగ్గర ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

గోవాలో అతిపెద్ద పార్టీగా బీజేపీ..
గోవాలో ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో.. 20 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌(21)కి ఒక్క స్థానం మాత్రమే ఆ పార్టీకి తగ్గడం గమనార్హం. ఇక కాంగ్రెస్‌ కూటమి ఇక్కడ 12 స్థానాల్లో విజయం సాధించగా.. తృణమూల్‌ కూటమి 2 చోట్ల.. ఆప్‌ మరో 2 చోట్ల గెలుపొందింది.

బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో గోవా బీజేపీ నేతలు స్పందిస్తూ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. తమకు మరో ముగ్గురి మద్దతు ఉందని, వారి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరేందుకు ఈ సాయంత్రం గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. బీజేపీ నేతలు చెపుతున్న ముగ్గురు నేతల్లో ఆంటోనియా వాస్, చంద్రకాంత్ షెట్యే, అలెక్స్ రెజినాల్డ్ ఉన్నారు.(Raja Singh On Election Results)

AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్

కాంగ్రెస్ కు ఘోర పరాభవం..
135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ దాదాపు అర్ధశతాబ్దానికి పైగా భారత్‌ను పాలించింది. స్థానికంగా కొత్తగా ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా బలమైన క్యాడర్‌తో దశాబ్దాల పాటు పలు రాష్ట్రాలను ఏకధాటిగా ఏలింది. సోనియాగాంధీ రాకతో పూర్వవైభవం వచ్చిందనుకున్న ఆ పార్టీకి.. నరేంద్ర మోదీ ఎంట్రీ చెక్‌ పెట్టినట్లు అయ్యింది. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని ఓటములు ఎదురవుతున్నాయి. తాజాగా పంజాబ్‌లోనూ అధికారాన్ని కోల్పోతున్న కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది.

పంజాబ్‌లో చీపురు సునామీ..
పంజాబ్‌ రాష్ట్రాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఊడ్చేసింది. అంచనాలకు మించి అఖండ విజయం సాధించింది. ఎంతలా అంటే ఆప్‌ జోరు ముందు ప్రముఖ నేతలు కూడా నిలవలేకపోయారు. ఏకంగా సీఎం చరణ్‌జీత్ సింగ్‌ చన్నీ సహా దాదాపు ప్రముఖ రాజకీయ నేతలందరూ ఓటమిపాలయ్యారు. మాజీ సీఎంలు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ వంటి దిగ్గజ నేతలను కూడా గెలుపు వరించలేదు.