MP Bandi Sanjay: చంద్ర మండలంకూడా ఖతమే..! కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ..

ఎమ్మెల్యే ప్రవాసీలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తున్న ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం బండి సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

MP Bandi Sanjay: చంద్ర మండలంకూడా ఖతమే..! కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ..

MP Bandi Sanjay

Updated On : August 25, 2023 / 1:06 PM IST

MP Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే చంద్ర మండలం కూడా ఖతమే అవుతుందని, చంద్రునిమీద కూడా కేసీఆర్ భూములిస్తామంటూ ప్రజలను నమ్మిస్తాడని సంజయ్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకోసం ఇటీవల ప్రకటించిన సీట్లలో సగం మందికి బీఫామ్‌లు రావు. కేసీఆర్ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే అని బండి సంజయ్ అన్నారు. ఒకరికి టికెట్ ఇచ్చి మరొకరిని ఇంటికి పిలుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సగం మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుసుకున్న కేసీఆర్.. ఆ ప్రక్రియను అడ్డుకునేందుకు హడావుడిగా అందరికీ సీట్లు ఇస్తున్నట్లు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారని సంజయ్ అన్నారు.

Amit Shah: అమిత్‌ షా వస్తున్నారు.. 27న ఖమ్మంలో బహిరంగ సభ.. షెడ్యూల్ ఇలా..

బీఆర్ఎస్ ఓడిపోతుందని, ఆ పార్టీకి కేవలం 25 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని సంజయ్ అన్నారు. 30 మంది కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ డబ్బులిచ్చి బరిలోకి దించుతున్నారని సంజయ్ ఆరోపించారు. హిందువుల ఓట్లకోసం సీఎం కేసీఆర్ కొత్త నాటకాలకు తెరలేపాడని సంజయ్ విమర్శించారు. కేసీఆర్ బిడ్డకు సీటిస్తే.. మహిళలకు 33శాతం ఇచ్చినట్టేనంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ప్రవాసీలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తున్న ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం బండి సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

 

పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కొద్దిసేపు చర్చించారు. అంతకుముందు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలతో కలిసి బండి సంజయ్ కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని సందర్శించారు. వారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.