CWC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎంపికలో రసవత్తరంగా మారుతున్న సమీకరణాలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ప్రాధాన్యం సముచితంగానే ఉన్నందున సీడబ్లూసీలో ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందట. రాష్ట్రంలోని ఒక కీలక నేత సైతం వీహెచ్, సీతక్క కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వస్తే మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని అనుమానంతో ఉన్నారట.

CWC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎంపికలో రసవత్తరంగా మారుతున్న సమీకరణాలు

Karnataka elections 2023

CWC: కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారాలు కలిగిన కీలక విభగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ)కి ఎన్నికలు నిర్వహించబోమని, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేనే కమిటీ సభ్యులను నియమిస్తారని రెండు రోజుల క్రితం పార్టీ ప్రకటించింది. అంతే, తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో ఒక్కసారిగా చలనం మొదలైంది. పార్టీలో సమీకరణాలు వెంటవెంటనే మారుతున్నాయి. పార్టీలోని కీలక నేతలు ఎవరికి వారు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహలతో పాటు ఎమ్మెల్యే సీతక్క తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.

G-20 Meet: ఢిల్లీలో జరిగే జీ-20 మీట్‭కు చైనా హాజరు, జపాన్ దూరం

సీడబ్ల్యూసీలో మొత్తం 35 సభ్యులు ఉంటారు. ఇందులో సగం మందిని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా వర్గాలకు చెందిన నాయకులు ఆ కోటాలో స్థానం దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దాదాపుగా ఖాయమనే వినిపిస్తోంది. అయితే ఇప్పటికే సీడబ్ల్యూసీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి సుబ్బిరామిరెడ్డికి అవకాశం ఉన్నందున ఏం జరుగుతుందో చివరి వరకు తెలియదని అంటున్నారు. ఇక ఎస్టీ కోటాలో ఎమ్మెల్యే సీతక్క తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారట. అలాగే ఓబీసీ కోటాలో సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో గుసగుస కొనసాగుతోంది.

Revanth Reddy: ఆడపడుచులు తమ గోడు వినిపించారు: విద్యార్థులతో మాట-ముచ్చటలో రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ప్రాధాన్యం సముచితంగానే ఉన్నందున సీడబ్లూసీలో ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందట. రాష్ట్రంలోని ఒక కీలక నేత సైతం వీహెచ్, సీతక్క కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వస్తే మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని అనుమానంతో ఉన్నారట. ఎవరికి వారు, ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అయితే చివరగా ఖర్గే ఎవరిని సీడబ్లూసీకి ఎంపిక చేస్తారనేది చూడాలి.