CM KCR Alert On Floods : అవసరమైన చోట్ల హెలిపాడ్లు సిధ్ధం చేసుకోండి-కేసీఆర్
తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు వరద ముంపుకు గురైన ప్రాంత మంత్రులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు.

Cm Kcrt On Floods
CM KCR Alert On Floods : తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు వరద ముంపుకు గురైన ప్రాంత మంత్రులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ మంత్రులకు సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని…ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతలకు తరలించాలని ఆదేశించారు. మరో 24 గంటల పాటు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని…. వరద సహయక చర్యల కోసం అవసరమైన ప్రాంతాల్లో హెలిపాడ్ లను సిధ్దం చేసుకోవాలని కేసీఆర్ మంత్రులకు, అధికారులకు సూచించారు.
Also Read : Telangana Rains : తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు..10 జిల్లాలకు రెడ్ అలర్ట్