సీఎం కేసీఆర్ బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 04:40 PM IST
సీఎం కేసీఆర్ బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష

CM KCR Budget Interim Review : 2020 – 2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష జరుపుతున్నారు సీఎం కేసీఆర్. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ఆర్థిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా…తెలంగాణలో లోటు బడ్జెట్ ఉన్న కారణంగా..రాష్ట్రానికి ఎంత ఆర్థిక నష్టం జరిగిందనే దానిపై చర్చిస్తున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తలకిందులైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. బడ్జెట్ లో ఎంత అంచనా వేసింది. ఎంత ఆదాయం వచ్చిందనే దానిపై అడిగి తెలుసుకుంటున్నారు.



గత సెప్టెంబర్ వరకు 23 శాతం అంచనాలు రీచ్ అయినట్లు, ఇంకా 67 శాతం లోటుగా ఉన్నట్లు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలకు బ్రేక్ లు వేయకుండా…ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మిగతా పథకాలను ఎలా నిర్వహించాలి ? కొత్త ప్రాజెక్టుల ప్రారంభంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. రైతు సంబంధిత అంశాలకు పెద్ద పీఠ వేయాలని భావిస్తున్నారు.



ఆదివారం శాఖల వారీగా..మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ సందర్భంగా..ప్రతిపాదించిన అంచనాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నడుమ..బేరీజు వేసుకుని దేనిపై కోతలు విధించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.



https://10tv.in/kcr-mid-term-review-meeting-today/
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ఆదాయం కేవలం 26.51 శాతం మాత్రమే. అప్పులు బడ్జెట్ అంచనాలకు వ్యతిరేకంగా 78.30 శాతానికి పెరిగాయి. సెప్టెంబర్‌ వరకు సీఏజీ విడుదల చేసిన లెక్కల ప్రకారం లక్షా 43 వేల 151.94 కోట్ల రూపాయలు అంచనా వేస్తే.. కేవలం 37 వేల 949.84 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. రాబోయే ఆరు నెలల కాలంలో మిగిలిన 73.49 శాతం ఆదాయాన్ని పొందడం దాదాపు అసాధ్యం అని ఆర్ధిక శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సాయంలో సెప్టెంబర్ వరకు రుణాలు 25 వేల 989.43 కోట్లుగా ఉన్నాయి.



ఈ ఏడాది ఆదాయం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసినా.. కరోనా, లక్‌డౌన్‌ కారణంగా లోటు బడ్జెట్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మధ్యంతర బడ్జెట్ సమీక్షతో కొన్ని విభాగాల బడ్జెట్ తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టరాదన్న నిర్ణయాన్నీ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.