CM KCR : అందరి కళ్లు హుజూరాబాద్ పైనే, సీఎం కేసీఆర్ షెడ్యూల్

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళితబంధు స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్‌.

CM KCR : అందరి కళ్లు హుజూరాబాద్ పైనే, సీఎం కేసీఆర్ షెడ్యూల్

Huzurabad

CM KCR Huzurabad : ప్రస్తుతం తెలంగాణలో అందరి కళ్లూ హుజూరాబాద్‌పైనే ఉన్నాయి. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికతోపాటు దళితబంధు పథకం అక్కడే ప్రారంభంకానుంది. 2021, ఆగస్టు 16వ తేదీ సోమవారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళితబంధు స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్‌. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి హుజూరాబాద్‌ బయలుదేరి వెళ్తారు.

Read More : Indian Idol 12 Finale : విజేత ఇతనే, ఆరోస్థానంలో షణ్ముఖ ప్రియ

మధ్యాహ్నం ఒంటిగంట 40 నిమిషాలకు శాలపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు శాలపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. సీఎం రాకతో హుజూరాబాద్‌ గులాబీ వర్ణ శోభితమైంది. గ్రామ గ్రామ సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. శాలపల్లికి వెళ్లే మార్గాన్ని మొత్తం సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయాయి. దీంతో హుజూరాబాద్‌ మొత్తం గులాబీమయమైంది.

Read More : AP Schools : ఏపీలో స్కూళ్లు రీఓపెన్… పాటించాల్సిన రూల్స్

దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా హుజూరాబాద్‌లో ప్రారంభించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.శాలపల్లి ఇందిరానగర్‌లో నిర్వహించనున్న సభలో లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఇవ్వబోతున్నారు. 2018 మే 10న ఇదే వేదికపై రైతుబంధును ప్రారంభించారు సీఎం కేసీఆర్. శాలపల్లిలో లక్షమందితో జరుగనున్న సభలో దళితబంధు అమలు చేసే తీరును, చేపట్టిన, చేపట్టనున్న ఇతర కార్యక్రమాలను సీఎం వివరించే అవకాశముంది. దళితబంధు పథకాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఈటల రాజేందర్‌ వ్యవహారంపై కేసీఆర్‌ ఇప్పటి వరకు ఎక్కడా బహిరంగంగా స్పందించలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి బహిరంగ సభలో ఈటలపై విమర్శనాస్త్రాలు సంధిస్తారా.. అన్నది హాట్‌టాఫిక్‌గా మారింది.