Palle, Pattana Pragathi : అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పనితీరును బేరీజు వేయడం జరుగుతుందని, అధికారుల తీరు మార్చుకోకుంటే..చర్యలు తీసుకుంటామని, ఆ తర్వాత ఎవరు చెప్పినా వినేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Palle, Pattana Pragathi : అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

Kcr Warning

CM KCR Review : అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పనితీరును బేరీజు వేయడం జరుగుతుందని, అధికారుల తీరు మార్చుకోకుంటే..చర్యలు తీసుకుంటామని, ఆ తర్వాత ఎవరు చెప్పినా వినేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2021, జూన్ 13వ తేదీ ఆదివారం ప్రగతి భవన్ లో పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని, తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని ప్రత్యక్షంగా పాల్గొంటానన్నారు. కలెక్టర్లు , జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు ఒక యజ్ఞంలా కృషి చేయాలని సూచించారు. వైరల్ సీజనల్ వ్యాధుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో వైద్యశాఖ, పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. అందుకు సంబంధించి ఒక చార్టును రూపొందించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వైరస్ విషయంలో రాష్ట్రంలో అందుతున్న వైద్యం, నియంత్రణ, వ్యాక్సినేషన్ గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇదే పద్దతుల్లో కొనసాగిస్తూనే ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

పట్టణ ప్రగతిపై సమీక్ష :-
పట్టణ ప్రగతిపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా, మున్సిపల్, మండల స్థాయి ఇంటర్ డిపార్ట్ మెంట్ కో ఆర్డినేషన్ మీటింగ్స్ నిరంతరం నిర్వహించాలని సూచించారు. పట్టణ స్థానిక సంస్థలు నాటే మొక్కల విషయంలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు సర్టిఫై చేయాలని, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులకు ఓరియంటేషన్ క్లాసులను రెగ్యులర్ గా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలతో సహా అన్ని అంశాల్లో ప్రతీ పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారుచేయాలని ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ను, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పట్టణాల్లో నివాసంలో ఉండే మహిళలకు ఇబ్బంది లేకుండా పబ్లిక్ టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ ఎలా ఉందో స్టడీ చేయడానికి మూడు, నాలుగు దేశాలకు ఒక అధికారుల టీమ్ ను పంపించాలని సంబంధిత మంత్రికి సూచించారు. పట్టణాలకు మిషన్ భగీరథ త్రాగునీరు బల్క్ సప్లై పూర్తి స్థాయిలో అందుతోందని, అంతర్గతంగా పైప్ లైన్ల సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు విషయంలో అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్, గజ్వేల్ లోని సమీకృత మార్కెట్ ను పరిశీలించాలని సీఎం సూచించారు.

లే అవుట్ల విషయంలో జాగ్రత్త : –
పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే లే అవుట్స్ విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కమ్యూనిటీలకు కేటాయించిన కమ్యూనిటీ హాల్, ట్రాన్స్ ఫార్మర్స్, సబ్ స్టేషన్స్, వాటర్ ట్యాంకర్ తదితరాలకు కేటాయించిన స్థలాలను కూడా లే అవుట్ యజమానులు తర్వాత అమ్ముకుంటున్నారని వివరించారు. వాటిని ముందే మున్సిపాలిటీల పేరు మీద రిజిస్టర్ చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, పట్టణాలు ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందేలా నిబంధనలకు అనుగుణంగా లే అవుట్లు ఉండేలా, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణాల్లో పూర్తి స్థాయిలో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయాలని, దీని వల్ల విద్యుత్ బిల్లుల ఖర్చు తక్కువగా వస్తుండడం సంతోషకరమన్నారు. నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి మాస్టర్ ప్లాన్ లో డైనమిక్ అప్డేషన్ చేయాలన్నారు. ప్రజా అవసరాల కోసం నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ ల్యాండ్ రికార్డ్స్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సూచించారు.

Read More : CM KCR Review : పట్టణ ప్రగతిపై మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి : సీఎం కేసీఆర్