Haath se haath Jodo: తెలంగాణలో 2 నెలల పాటు ‘హాథ్ సే హాథ్ జోడో’ కార్యక్రమం.. రేపు మేడారంలో..
తెలంగాణలో 2 నెలల పాటు హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభించాల్సిన ఈ యాత్రపై టీపీసీసీ ప్రణాళికలు వేసుకుంది. రేపు మేడారంలో ఈ యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Haath se haath Jodo: తెలంగాణలో 2 నెలల పాటు హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభించాల్సిన ఈ యాత్రపై టీపీసీసీ ప్రణాళికలు వేసుకుంది. రేపు మేడారంలో ఈ యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం నిర్వహించనున్న విషయం తెలిసిందే.
కేంద్రంలోని ఎన్డీఏ, తెలంగాణలోని టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని టీపీసీసీ నేతలు చెప్పారు. రేపు తెలంగాణలోని ప్రతి నియోజక వర్గంలో ఓ నేత ఇందులో పాల్గొనాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మధుయాష్కీ సహా ఇతర నేతలు పాల్గొనాలని నిర్ణయించారు. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్ని రోజుల్లో 50 నియోజక వర్గాల్లో పర్యటిస్తారు.
ఇప్పటికే రూట్ మ్యాప్ పై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చింది. నాలుగు కారవాన్లను సన్నద్ధం చేశారు. జనరేటర్లు, సౌండ్ సిస్టమ్ వాహనాలను కూడా వాడనున్నారు. కాగా, ఈ నెల 24 నుంచి 26 వరకు రాయ్ పూర్ లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు మంచి స్పందన రావడంతో అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Vani Jairam : వాణీ జయరాం మరణంపై అనుమానాలు.. పోస్టుమార్టంలో గాయాలు గుర్తింపు!