Bhatti Vikramarka : ఆరు గ్యారెంటీలు ఆరు నెలల్లోపే అమలు చేస్తాం : భట్టి విక్రమార్క
దళితబంధు,బీసీ బంధు, గృహలక్ష్మి పధకాలు, రుణమాఫీలు అమలు అయినట్లుగా మెసేజ్ లు పంపిస్తు ప్రజల్ని మోసం చేసినందుకు ఓటు వేయాలా? ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పేవాళ్లను నమ్మొద్దు అంటూ ప్రజలకు సూచించారు.

Bhatti Vikramarka
Congress leader Bhatti Vikramarka : కాంగ్రెస్ ను గెలిపించండీ మీ ఓటుతో అధికారం ఇస్తే ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే అమలు చేస్తాం అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఖమ్మంలోని మధిరలో మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ కు ఓటు ఎందుకు వేయాలి..?ప్రజల్ని మోసం చేసినందుకు ఓటు వేయాలా..?అని ప్రశ్నించారు.
దళితబంధు,బీసీ బంధు, గృహలక్ష్మి పధకాలు, రుణమాఫీలు అమలు చేసినట్లుగా మెసేజ్ లు పంపిస్తు ప్రజల్ని మోసం చేసినందుకు ఓటు వేయాలా?అంటూ ప్రశ్నించారు. ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పేవాళ్లను నమ్మొద్దు అంటూ ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ను గెలిపించండీ మీ ఓటుతో అధికారం ఇస్తే ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే అమలు చేస్తాం అంటూ హామీ ఇచ్చారు.
119 మంది అభ్యర్థులను ప్రకటిస్తా.. సర్వేలు అన్నీ ఓ విషయాన్నే చెబుతున్నాయి: కేఏ పాల్
కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి అంటున్న కేటీఆర్ ప్రజల్ని మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సంపదని దోచుకుంటున్నారని విమర్శించారు. అటువంటి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలి..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గృహలక్ష్మి ,బీసీలకు బీసీ బంద్ అంటూ కాగితాలు పంచుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్ని మోసం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు మరోసారి మోసం చేసేందుకు బయలుదేరారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా..తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నాయి. ఓ పక్క బీజేపీ, మరోపక్క కాంగ్రెస్ నేతలు, ఇక అధికార పక్షం నేత గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నారు. సభలు, సమావేశాలతో హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు.