T Congress Politics : కోమటిరెడ్డి బ్రదర్స్‌పై షబ్బీర్ అలీ ఫైర్ .. మీ అన్నదమ్ములిద్దరి మధ్యే సఖ్యత లేదుగానీ అందరిని విమర్శిస్తారంటూ చురకలు

కోమటిరెడ్డి బ్రదర్స్ పై మండి పడ్డారు షబ్బీర్ అలీ. కోమటిరెడ్డి బ్రదర్స్ పీసీసీ పదవి కోసం ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకునేవారని..మీ అన్నదమ్ములిద్దరికి మధ్యే సఖ్యత లేదు..మీరు అందరిని విమర్శిస్తారంటూ చురకలు వేశారు.

T Congress Politics : కోమటిరెడ్డి బ్రదర్స్‌పై షబ్బీర్ అలీ ఫైర్ .. మీ అన్నదమ్ములిద్దరి మధ్యే సఖ్యత లేదుగానీ అందరిని విమర్శిస్తారంటూ చురకలు

T Congress Politics

T Congress Politics : అటు అధికారి పార్టీ టీఆర్ఎస్.. ఇటు బీజేపీ మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ మాత్రం సొంత పార్టీ నేతల మధ్య కుంపట్లు రగులుతున్నాయి. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు సర్వసాధారణమే. కానీ కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక గెలుపు విషయంలో కూడా నేతల మధ్య విమర్శలు..వివాదాలు కొనసాగుతున్నాయి. సొంత పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటున్నారు. పార్టీలో నేను గొప్ప అంటే కాదు నేనే గొప్ప అన్నట్లుగా సీనియర్ నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.

ఈక్రమంలో నల్లగొండలో నిర్వహించిన ఓ సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పై ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు షబ్బీర్ అలీ. కోమటిరెడ్డి బ్రదర్స్ పీసీసీ పదవి కోసం ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకునేవారని (ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారు) చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి సొంతపార్టీ నేతలపై విమర్శలు చేయటం మాని మునుగోడులో ప్రచారం చేయాలని..మనలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా పార్టీ కోసం అందరు కష్టపడి పనిచేయాల్సిందేనని సూచించారు. మీ అన్నదమ్ముల మధ్యే సఖ్యతలేదు..మీరు మరొకరిపై విమర్శలు చేస్తారు..పైగా నువ్వు స్టార్ కంపెయినర్ వి కూడా అంటూ మండిపడ్డారు.స్థానిక ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయాలని ఆ బాధ్యత ఉంటే మాకు ఇక్కడేం పని అంటూ చురకలు వేశారు.

స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ ఇద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రులు గా చేశారు..కానీ రేవంత్ రెడ్డి పీసిసి చీఫ్ గా ఎన్నికైనప్పటి నుండి షబ్బీర్ అలీ రేవంత్ కి సన్నిహితుడిగా ముద్ర పడింది.. వీరి వివాదం ఇక్కడే మొదలైంది.. పీసీసీ విషయంలో కోమటిరెడ్డి కి షబ్బీర్ మద్దతు తెలపలేదు..ప్రస్తుతం ఆయన పొలిటికల్ అఫైర్స్ కమిటీకి కన్వీనర్ గా కూడా కొనసాగుతున్నారు.. కోమటిరెడ్డి గాంధీ భవన్ లో జరిగే సమావేశాలకు ఏనాడు కూడా హాజరుకాకపోగా ఆరు సార్లు ఓడిపోయిన వాళ్లు సమావేశాలు పెడితే..తాము అటెండ్‌ అవ్వాలా..అని షబ్బీర్‌ అలీపై కామెంట్లు చేశారు. అప్పటి నుంచీ వీరి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.