Venkat Reddy Munugodu By-Election : మునుగోడు బైపోల్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరం

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌లో తనకు జరుగుతోన్న అవమానంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని తొలగించాలని, అందరి అభిప్రాయాల సేకరణ చేసి కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాలని కోరారు.

Venkat Reddy Munugodu By-Election : మునుగోడు బైపోల్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరం

Venkat Reddy Munugodu By-Election

Updated On : August 23, 2022 / 9:07 AM IST

Venkat Reddy Munugodu By-Election : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌లో తనకు జరుగుతోన్న అవమానంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని తొలగించాలని, అందరి అభిప్రాయాల సేకరణ చేసి కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాలని కోరారు. తాను కాంగ్రెస్‌ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

గత మూడు దశాబ్దాల నుంచి విశ్వసనీయ వ్యక్తిగా, విధేయుడిగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్న తనను… లక్ష్యంగా చేసుకుని ఇటీవల కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు. తెలంగాణ పీసీసీకి సహకరిస్తూ రాబోయే కాలంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నానన్నారు. అయితే రేవంత్‌రెడ్డి అండ్‌ కోర్‌ టీమ్‌ తనపై వ్యక్తిగతంగా మాటల దాడి చేయడం బాధించిందన్నారు.

Komatireddy Venkat Reddy Letter Sonia Gandhi : సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ..సమావేశానికి హాజరుకాకపోవడంపై వివరణ

దొంగనాటకాలాడి కాంగ్రెస్‌ తెలంగాణ ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌…పార్టీనే నమ్ముకున్న తనలాంటి కార్యకర్తకు ఎంతో అన్యాయం చేశారన్నారు. వెంటనే ఇంచార్జ్‌ హోదా నుంచి మాణిక్యం ఠాగూర్‌ను తప్పించాలని… కమల్‌నాథ్‌ వంటి సీనియర్‌ నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని తన లేఖలో సోనియాను కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోరారు.