ఢిల్లీలో నిరవధికదీక్షకు మీరు సిద్ధమా? : కేటీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఐటీఐఆర్, విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధికదీక్షకు మీరు సిద్ధమా? అని సవాల్ చేశారు.

ఢిల్లీలో నిరవధికదీక్షకు మీరు సిద్ధమా? : కేటీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

Revanth open letter to KTR : మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఐటీఐఆర్, విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధికదీక్షకు మీరు సిద్ధమా? అని సవాల్ చేశారు. మలివిడత పార్లమెంట్ సమావేశాల్లో మోడీపై ఒత్తిడి పెంచుదాం వస్తారా? అని ప్రశ్నించారు.

నా సవాల్ ను స్వీకరించకుంటే మోడీ తొత్తులుగా, తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీది ఆత్మ ఒక్కటే.. శరీరాలే వేరని విమర్శించారు. ఎన్నికలప్పుడు కుస్తీ, తర్వాత దోస్తీ..ఏడేళ్లుగా ఇదే జరుగుతోందన్నారు.

తెలంగాణ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, ఐటీఐఆర్‌, రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీలో దీక్షకు రావాలని సవాల్‌ విసిరారు. ఇద్దరం కలిసి ఢిల్లీలో దీక్షకు దిగుదామని చెప్పారు. మోడీని ఢీకొట్టే దమ్ముందా..? అని ప్రశ్నించారు.