గర్భిణిని తరలించిన 102 వాహన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్

గర్భిణిని తరలించిన 102 వాహన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్

యాదాద్రి భునగిరి జిల్లాలో గర్భిణిని తరలించిన 102 వాహనం డ్రైవర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ గర్భిణిని క్వారంటైన్ కు తరలించారు. గర్బిణి తీవ్ర భయాందోళనకు గురవుతోంది. వివరాల్లోకి వెళ్తే బొమ్మలరామారం మండలం గోవింద్ తండాకు చెందిన గర్భిణి ఏప్రిల్ 22వ తేదీ అస్వస్థతకు గురైంది. చికిత్స కోసం ఆమె స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ కు వెళ్లింది.

మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ వాహనంలో హైదరాబాద్ లోని కోఠి ప్రసూతి హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు గర్భిణిని పరీక్షించారు. డెలివరీకి ఇంకా సమయం ఉందని చెప్పి సదరు గర్భిణిని 102 వాహనంలో ఇంటికి పంపించారు. గర్భిణిని తరలించిన 102 వాహనం డ్రైవర్ కు కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

దీంతో డ్రైవర్ కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ చేశారు. దీంతో అతను ఇచ్చిన సమాచారం మేరకు గర్భిణిని, ఆమె భర్త, అత్తమామలను బీబీ నగర్ ఐసోలేషన్ కు వార్డుకు తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.