CPI Narayana : ఏపీ సీఎం జ‌గ‌న్‌ని కూడా చేర్చుకోవాలి.. కేసీఆర్‌కు సీపీఐ నారాయ‌ణ స‌ల‌హా

సీఎం జ‌గ‌న్ ని కూడా బీజేపీ వ్య‌తిరేక కూట‌మిలో చేర్చుకోవాల‌ని కేసీఆర్‌కు స‌ల‌హా ఇచ్చారు నారాయణ. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్‌ను ఆయన అభినందించారు.

CPI Narayana : ఏపీ సీఎం జ‌గ‌న్‌ని కూడా చేర్చుకోవాలి.. కేసీఆర్‌కు సీపీఐ నారాయ‌ణ స‌ల‌హా

CPI Narayana : టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజ‌కీయాల్లో కూట‌మి క‌డుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలను కలుసుకుంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజ‌కీయాల్లో కూట‌మి క‌డుతున్న సీఎం కేసీఆర్ చ‌ర్య‌ల‌ను సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ స్వాగ‌తించారు. దీనిపై స్పందించిన నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.

బీజేపీ వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటు దిశ‌గా బీహార్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేసీఆర్.. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్‌ల‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీని కూడా నారాయ‌ణ స్వాగ‌తించారు. ఈ క్రమంలో, వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కూడా బీజేపీ వ్య‌తిరేక కూట‌మిలో చేర్చుకోవాల‌ని కేసీఆర్‌కు స‌ల‌హా ఇచ్చారు నారాయణ.

CPI Narayana : జూ.ఎన్టీఆర్ పై నారాయణ ఆగ్రహం.. అమిత్ షాను కలవాల్సిన కర్మ ఏంటి?

హైద‌రాబాద్‌లోని మ‌గ్ధూం భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన నారాయ‌ణ‌.. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్‌ను ఆయన అభినందించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులను కేసీఆర్ కలవాలని నారాయణ చెప్పారు. ఆప్ నాయకుల విషయంలో సీబీఐ . కొండను తవ్వి ఎలుకని పట్టుకున్నట్లుందని ఆయన చురకలు వేశారు. గుజరాత్ వాళ్లు దేశాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న బీజేపీ నేత‌లు వ‌రుస‌బెట్టి సినిమా హీరోల‌ను క‌లుస్తున్న వైనంపైనా నారాయణ ఘాటుగా స్పందించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త‌న తెలంగాణ టూర్‌లో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీపై నారాయ‌ణ‌ స్పందిస్తూ.. గొప్ప రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కుటుంబానికి చెందిన జూనియ‌ర్ ఎన్టీఆర్ అమిత్ షాను క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. సినిమా తార‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటున్న బీజేపీ… వారి ద్వారానే తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చాల‌ని చూస్తోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

”కేసీఆర్ బీహార్ సీఎం నితీశ్ ను కలవడం మంచి పరిణామం. ఏపీ సీఎం జగన్‌ను కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలి. తెలంగాణలో సినీ నటులను బీజేపీ ప్రసన్నం చేసుకుంటోంది. సినీ యాక్టర్స్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వారి ద్వారా టీఆర్ఎస్ ను బలహీన పరచాలని చూస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి గొప్ప రాజకీయ చరిత్ర ఉంది. ఆయనకు క్రిమినల్ అయిన అమిత్ షాను కలవాల్సిన కర్మ ఏంటి?” అని నారాయణ ఫైర్ అయ్యారు.

Kishan Reddy: ఏ పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ పోరాటం చేస్తోందని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని.. ఇకపై తెలంగాణలో ఆ పార్టీ ఆటలు సాగనివ్వబోమని చెప్పారు. మునుగోడులో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించామని చెప్పారు. గుడిసెలు లేని తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేయాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ కృషి చేయాలని.. వర్సిటీకి శాశ్వత వీసీని నియమించాలని చాడ వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.