Pneumonia Vaccine PCV-14 : బయోలాజికల్-ఈ నుంచి న్యుమోనియా వ్యాక్సిన్.. పీసీవీ-14 టీకా వినియోగానికి డీసీజీఐ అనుమతి

హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఈ మరో ఘనత సాధించింది. స్ట్రెప్టోకస్ న్యుమోనియా వైరస్ ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన 14-వాలెంట్ పీడియాట్రిక్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ-14) వినియోగానికి డీసీజీఐ అనుమతి లభించింది.

Pneumonia Vaccine PCV-14 : బయోలాజికల్-ఈ నుంచి న్యుమోనియా వ్యాక్సిన్.. పీసీవీ-14 టీకా వినియోగానికి డీసీజీఐ అనుమతి

pneumonia vaccine

pneumonia vaccine PCV-14 : హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఈ మరో ఘనత సాధించింది.స్ట్రెప్టోకస్ న్యుమోనియా వైరస్ ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన 14-వాలెంట్ పీడియాట్రిక్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ-14) వినియోగానికి డీసీజీఐ అనుమతి లభించింది. ఈ మేరకు శుక్రవారం సంస్థ ప్రకటించింది.

ఈ టీకాను 6,10,14 వారాల వయసులో శిశవులకు ఇవ్వొచ్చని పేర్కొంది. భారత్ తోపాటు ఇతర దేశాల్లో 5 ఏళ్ల లోపు వయసున్న ఎంతో మంది పిల్లల మరణాలకు కారణమవుతున్న న్యుమోనియాను నిరోధించేందుకు పీసీవీ-14 వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని వెల్లడించింది. 14 రకాల స్ట్రెప్టోకోకస వైరస్ వేరియంట్లను ఎెదుర్కోగలదని పేర్కొంది.

Vaccinations for young children : చిన్న పిల్లలకు వేసే టీకాల విషయంలో పెద్దలకు అవగాహన తప్పనిసరా?

భారత్ లో అధికంగా వ్యాప్తి చెందుతున్న 22ఎఫ్, 33 ఎఫ్ రకం స్ట్రెప్టోకోకస్ వైరస్ నుంచి సమర్థవంతంగా రక్షణ కల్పిస్తుందని చెప్పింది. వ్యాక్సిన్ కు అనుమతులు లభించడం పట్ల బయోలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్ల ఆనందం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.