Telangana assembly : అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్.. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన డిప్యూటీ స్పీకర్

డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే రసమయి మధ్య వాగ్వాదం జరిగింది. మైక్ కట్ చేయడంపై ఎమ్మెల్యే రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం చెప్పనివ్వకుండా మైక్ కట్ చేస్తున్నారన్నారు.

Telangana assembly : అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్.. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన డిప్యూటీ స్పీకర్

Rasamai

Deputy Speaker Padma Rao : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. అధికారి పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతుండగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు మైక్ కట్ చేశారు. ప్రశ్నలు అడగకుండా స్పీచ్ ఇస్తున్నారని తెలిపారు. దీంతో సభలో చిన్నపాటి వాగ్వాదానికి దారి తీసింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే రసమయి మధ్య వాగ్వాదం జరిగింది. మైక్ కట్ చేయడంపై ఎమ్మెల్యే రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం చెప్పనివ్వకుండా మైక్ కట్ చేస్తున్నారని రసమయి రుసరుసలాడారు.

ఇలాగైతే తమకు ప్రశ్నలే ఇవ్వొద్దంటూ అసహనం వ్యక్తం చేశారు. రెండు ముచ్చట్లు మంత్రిని అడగలేకపోతే ప్రశ్నలేసి ఏమీ లాభమని అడిగారు. అసెంబ్లీలో మంత్రిని ఏమీ అడిగారు, ఏమీ తీసుకొచ్చావని రేపటి రోజు ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలన్నారు. అలాంటప్పుడు తమకు క్వశ్చన్స్ ఇవ్వొద్దని.. ఒక్కరికే క్వశ్చన్స్ ఇవ్వండని.. వారికే సమాధానం చెప్పుకోండి అని అన్నారు.

Rasamayi Balakishan: మళ్ళీ రసమయినే తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్!

ప్రశ్నలు అడగనీయకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. మాట్లాడుదామంటే మాట్లాడే అవకాశం రాదు.. కనీసం క్వశ్చన్స్ లోనైనా అడిగే అవకాశం రానియ్యకపోతే ఎలాగని వాపోయారు. ముఖ్యమైన మానుకొండూరు నియోజకవర్గంలో ఎక్కువగా ముదిరాజులు, బెస్తలు, గంగ పుత్రులు ఉన్నారని తెలిపారు. రసమయ బాలకిషన్ అసంతృప్తిపై మంత్రి కలగజేసుకున్నారు.

మంత్రిపైనా రసమయి అసంతృప్తి వ్యక్తం చేశారు. క్వశ్చన్ అడగ వద్దంటే కూర్చుంటామని అన్నారు. ప్రశ్న అడగకుండా ఎమ్మెల్యే రమసయి మధ్యలోనే కూర్చున్నాడు. అనంతరం కంప్లీట్ చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు కోరారు.