Telangana Politics: మేం సహకరించం.. తెల్లం వెంకట్రావుపై ఐదు మండలాల బీఆర్ఎస్ నేతల అసంతృప్తి.. 50 కార్లతో భారీ ర్యాలీగా…

భద్రాచలం అసెంబ్లీ సీటును బోదెబోయిన బుచ్చయ్యకు కేటాయించాలని ఐదు మండలాల పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బుచ్చయ్య 20 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉంటూ..

Telangana Politics: మేం సహకరించం.. తెల్లం వెంకట్రావుపై ఐదు మండలాల బీఆర్ఎస్ నేతల అసంతృప్తి.. 50 కార్లతో భారీ ర్యాలీగా…

Tellam venktrao

Tellam Venktrao : ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅనుచరుడు తెల్లం వెంకట్రావ్ ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన విషయం విధితమే. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ అధిష్టానంసైతం ఆమేరకు తెల్లంకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే, తెల్లం వెంకట్రావుపై నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్యనేతలు గుర్రుగా ఉన్నారు. వెంకట్రావు బీఆర్ఎస్‌ పార్టీలో చేరికపై అసంతృప్తితోఉన్న ఐదు మండలాల బీఆర్ఎస్ ముఖ్యనేతలు మంత్రి పువ్వాడ అజయ్‌ను కలిసేందుకు 50కార్లతో బయలుదేరారు. భద్రాచలం అసెంబ్లీ టికెట్‌ను తెల్లం వెంకట్రావుకు ఇస్తే మేము సహకరించమని వారు చెబుతున్నారు.

Venigandla Ramu : గుడివాడ టికెట్ చంద్రబాబు ఎవరికిచ్చినా నాకు బాధ లేదు, కొడాలి నానిని ఓడించడమే నా ధ్యేయం- వెనిగండ్ల రాము

భద్రాచలం అసెంబ్లీ సీటును బోదెబోయిన బుచ్చయ్యకు కేటాయించాలని ఐదు మండలాల పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బుచ్చయ్య 20 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, ఎంపీపీగా మార్కెట్ చైర్మన్‌గా పనిచేశారని, భద్రాచలం అసెంబ్లీ సీటు బుచ్చయ్యకు కేటాయిస్తే భారీ మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్‌కు గిఫ్టుగా ఇస్తామని ఐదు మండలాల బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌ను కలవడానికి ఐదు మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్లలో భద్రాచలం నుంచి  ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.

Heavy Rains : తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెల్లం వెంకట్రావు 2014 లో మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కాలంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భద్రాచలం నియోజకవర్గం నుంచి పోటీ‌చేసి ఓడిపోయారు. కొద్ది నెలలుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంట కొనసాగారు. ఇటీవల పొంగులేటి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, కొద్దిరోజులకే మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

కేవలం టికెట్ కోసమే తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్ పార్టీలో చేరాడని, అవసరాన్ని బట్టి ఆయన పార్టీలు మారుతుంటాడని, తెల్లంకు అసెంబ్లీ టికెట్ ఇస్తే మేమంతా పార్టీకిసైతం రాజీనామా చేసేందుకు సిద్ధమవుతామని భద్రాచలం నియోజకవర్గంలోని ఐదు మండలాల బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.