Heart Attack : షాకింగ్.. గుండెపోటుతో దుండిగల్ ఎస్ఐ మృతి

Heart Attack : సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది, ఆ మరుక్షణమే ప్రాణం పోతుంది. ఈ తరహా మరణాల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

Heart Attack : షాకింగ్.. గుండెపోటుతో దుండిగల్ ఎస్ఐ మృతి

Heart Attack (Photo : Google)

Heart Attack – Dundigal SI : ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిపోయింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అందరూ గుండెపోటు బారిన పడుతున్నారు. అంతలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. జబ్బులతో బాధపడుతున్న వారే కాదు.. ఎలాంటి అనారోగ్యం లేని వారు ఎంతో హెల్తీగా, ఫిట్ గా ఉన్న వారు కూడా హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది, ఆ మరుక్షణమే ప్రాణం పోతుంది. ఈ తరహా మరణాల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

తాజాగా జీడిమెట్లలో విషాదం చోటు చేసుకుంది. దుండిగల్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. గండి మైసమ్మలోని తన ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో ఎస్ఐ ప్రభాకర్ ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దాంతో ఎస్ఐ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు.

Also Read..Hyderabad : డబ్బు అడిగిన యువతికి కోరిక తీర్చాలని వేధింపులు, ఆ తర్వాత వీడియోలు చూపి.. హైదరాబాద్‌లో దారుణం

గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. అసలు, ఎందుకీ గుండె ఇంత వీక్ గా తయారైంది? అని ప్రశ్నిస్తే.. అందుకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. మారిన జీవనశైలి, ఆహారపు ఆలవాట్ల వల్ల గుండె సంబంధ సమస్యలు పెరిగిపోయాయని వివరించారు. ప్రధానంగా ఈ రోజుల్లో చాలామందికి శారీరక శ్రమ లేకుండా పోయింది. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే జాబులు ఎక్కువైపోయాయి. ఇక, ఆహారం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, స్మోకింగ్, డ్రింకింగ్.. ఇవన్నీ బాగా ఎక్కువయ్యాయి. ఇలాంటి జీవనశైలి అలవాట్ల కారణంగా కూడా గుండెపోటు సంభవించే ప్రమాదం ఉందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

మన తినే ఆహారమే మన ఆరోగ్యంపై ప్రధానంగా ప్రభావం చూపుతుందని డాక్టర్లు అంటున్నారు. ఉప్పు, కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని, ఫలితంగా అది గుండె పోటుకు దారితీస్తుందని వివరించారు. కాబట్టి ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read..Tamil Nadu : ముస్లిం అన్నదమ్ములను ప్రేమించిన అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు వద్దనడంతో ఆత్మహత్య

మితిమీరిన మద్యపానం, ధూమపానం ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. గుండెపోటుకు అధిక మోతాదులో మద్యం తాగడం, ఎక్కువగా ధూమపానం చేయడం కారణమని వారు అంటున్నారు. సిగరెట్లు, పొగాకు నుంచి వచ్చే పొగ రక్తనాళాలపై ప్రభావం చూపి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. అందుకే.. మద్యంపానం, ధూమపానానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం మన ఆరోగ్యంతో పాటు గుండెకు శ్రేయస్కరం అంటున్నారు వైద్యు నిపుణులు.