JEE Advanced Exam : జేఈఈ అడ్వాన్స్ డ్ ఆన్ లైన్ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్.. ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు

సికింద్రాబాద్ లో పరీక్ష రాస్తున్న విద్యార్థి వాట్సాస్ ద్వారా మిగిలిన నలుగురికి సమాధానాలు చేరవేశారు. మల్లాపూర్ లో పరీక్ష రాస్తున్న విద్యార్థిపై అనుమానం రావడంతో ఇన్విజిలేటర్ అతన్ని తనిఖీ చేయగా స్మార్ట్ ఫోన్ బయట పడింది.

JEE Advanced Exam : జేఈఈ అడ్వాన్స్ డ్ ఆన్ లైన్ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్.. ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు

High-tech copying

High-Tech Copying : జేఈఈ అడ్వాన్స్ డ్ ఆన్ లైన్ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు అయింది. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాల కోసం జూన్ 4న జేఈఈ అడ్వాన్స్ డ్ ఆన్ లైన్ ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఐదుగురు విద్యార్థులు హైటెక్ కాపీయింగ్ కు పాల్పడి దొరికిపోయారు. వీరిపై హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నాలుగు కేసులు నమోదు అయ్యాయి.

ఐఐటీల్లో సీట్లు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితులు మొదటగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆదివారం జరిగిన పరీక్షకు అందరూ స్మార్ట్ ఫోన్లతో పరీక్షకు హాజరయ్యారు. వీరిలో టాపర్ అయిన కడప జిల్లాకు చెందిన ఓ టీచర్ కుమారుడికి సికింద్రాబాద్ లోని ఎస్వీఐటీ కాలేజీలో సెంటర్ పడగా, అతడి సోదరుడైన మరో విద్యార్థికి మౌలాలిలో, మరో ఇద్దరు సోదరులకు మల్లాపూర్ లో ఇంకో విద్యార్థికి ఎల్ బీ నగర్ లో ఎగ్జామ్ సెంటర్ పడింది.

Hyderabad Police: ఆన్‌లైన్‌ ఎగ్జామ్ మాస్ కాపీయింగ్ గుట్టురట్టు

సికింద్రాబాద్ లో పరీక్ష రాస్తున్న విద్యార్థి వాట్సాస్ ద్వారా మిగిలిన నలుగురికి సమాధానాలు చేరవేశారు. మల్లాపూర్ లో పరీక్ష రాస్తున్న విద్యార్థిపై అనుమానం రావడంతో ఇన్విజిలేటర్ అతన్ని తనిఖీ చేయగా స్మార్ట్ ఫోన్ బయట పడింది. అదే కేంద్రంలో అతడి సోదరుడు కూడా స్మార్ట్ ఫోన్ తో పట్టుబడ్డాడు.

సికింద్రాబాద్ నుంచి సమాధానాలు వస్తున్నట్లు వారు చెప్పడంతో అక్కడి విద్యార్థిని తనిఖీ చేయగా అతని వద్ద ఫోన్ బయటపడింది. మౌలాలి, ఎల్ బీ నగర్ లో పరీక్ష రాస్తున్న ఇద్దరి దగ్గర స్మార్ట్ ఫోన్లు లభించాయి. కాపీయింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పరీక్ష కేంద్రంలోకి స్మార్ట్ ఫోన్స్ ఎలా తీసుకెళ్లారన్న కోణంలో విచారణ చేపట్టారు.