HoardingPolicyఅతిక్రమణలు : లక్షల్లో జరిమానా, ఏ సంస్థకు ఎంత ఫైన్ వేశారంటే

HoardingPolicyఅతిక్రమణలు : లక్షల్లో జరిమానా, ఏ సంస్థకు ఎంత ఫైన్ వేశారంటే

Illegal Hoardings : హైదరాబాద్ నగరంలో హోర్డింగ్స్ (Hoardings), నేమ్‌ బోర్డు (Name Board)ల అతిక్రమణలపై కొరడా ఝలిపిస్తోంది జీహెచ్ఎంసీ (GHMC). నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన ఆయా సంస్థలకు లక్షల రూపాయల ఫైన్‌లు వేస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన 68 జీవోను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు బల్దియా అధికారులు. ఇదిలా ఉండగా..ఓ వైపు కరోనా కష్టాల్లో ఉంటే…ఇప్పుడు ఫైన్లు ఎలా కట్టమంటారంటూ వాపోతున్నారు వ్యాపారులు. హైదరాబాద్‌లో హోర్డింగ్స్ అతిక్రమణలను రెగ్యులెట్ చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జివో 68ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించింది జీహెచ్ఎంసీ. అందులో భాగంగా సిటిలోని మాల్స్, షాప్‌ల వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, నేమ్ బోర్డులపై ఫోకస్ చేశారు బల్దియా అధికారులు. వాటిని తొలగించాలని నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

GO 68 హోర్డింగ్ పాలసీ :-
ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వం జివో 68 పేరుతో హోర్డింగ్‌ పాలసీ (Go 68 Hoarding Polcy)ని తీసుకువచ్చింది. గ్రౌండ్ లెవల్ నుంచి 15 అడుగల వరకు ఉండేలా చూడాలని డిసైడ్ చేశారు. హోర్డింగ్ పాలసిీ (Hoarding Polcy) నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 10 వేల నుండి లక్ష రూపాయల వరకు జరిమాన విధించే అవకాశం ఉంది. దీంతో అతిక్రమణలను గుర్తించి భారీగా ఫైన్లు వేస్తున్నారు అధికారులు. ఇంతకాలం ప్లెక్సీ (Flxi)లు, వాల్ పోస్టర్ల (Wall Posters) పై నామమాత్రపు ఫైన్లు వేసిన జీహెచ్ఎంసీ (GHMC)…ఇప్పుడు భారీగా ఫైన్లు వేస్తోంది. ఏకంగా లక్షలాది రూపాయల ఫైన్లు వేసేస్తున్నారు. ఆయా సంస్థలు చేసిన అతిక్రమణలను బట్టి ఫైన్స్ వాయించేస్తున్నారు.

షాపింగ్ మాల్స్‌కు భారీ జరిమాన :-
అమీర్‌పేట్ వద్ద ఉన్న చైన్నై షాపింగ్ మాల్‌ (Chennai Shoping Mall)కు ఏకంగా 4 లక్షల రూపాయల ఫైన్ వేశారు. అక్రమంగా అడ్వర్‌టైజ్‌మెంట్స్‌ (Advertaizments) ఏర్పాటు చేయడంతో పాటు గ్రౌండ్ లేవల్ నుంచి 15అడుగుల కంటే ఎత్తు వరకు ఏర్పాటు చేయ్యడంపై ఈ ఫైన్ వేశామంటున్నాయి బల్దియా వర్గాలు. ఇక నిజాంపేట్ క్రాస్ రోడ్డులో ఉన్న జిపిఆర్ మల్లీపెక్స్‌కు (GPR Multiplex) 3లక్షల ఫైన్ వేశారు. పంజాగుట్ట ఎల్జీ షోరూం(LG Show Room) కు 2 లక్షలు…,సికింద్రాబాద్ పర్నిచర్ షాప్‌కు 2 లక్షలు…,సిటి సెంట్రల్‌కు రెండు లక్షలు..నిజాంపేట్ మోర్‌కు 3 లక్షలు..,గచ్చిబౌలి అత్రీయం మాల్‌కు నాలుగు లక్షలు..,అమీర్ పేట్‌లోని విఆర్కె సిల్స్స్‌కు 2లక్షలు..,ఎస్‌ఆర్‌నగర్ రిలయన్స్ డిజిటల్‌కు లక్ష.., బజాన్ షోరూం లక్షా 50వేలు.., పంజాగుట్టా ఎల్జీ షోరూంకు 2లక్షలు..,లక్డికాపూల్ ఇంపిరియల్ రెస్టారెంట్‌కు లక్ష రూపాయలు..,సోనో విజన్ షోరూంకు లక్షా 50వేలు ఫైన్ వేశారు బల్దియా.

ఏడు సంస్థలపై :-
ఇక అత్యధికంగా ఏడు సంస్థల‌పై జ‌రిమానాలు విధించారు. ఇప్పుడు ఆ ఏడు సంస్థలకు నోటిసులు జారీ చేశారు బల్దియా అధికారులు. ఇందులో ది బ్రిటీష్ స్పోకెన్ ఇంగ్లీష్‌కు 33లక్షలు…,ది రాపిడో బైక్ ట్యాక్సికు 14ల‌క్షలు….,ది నేచుర‌ల్ హేర్ ట్రీట్‌మెంట్ 39ల‌క్షల 56వేలు…,వెంక‌ట్ జాబ్స్ ఇన్ ఎం.ఎన్‌.సి సంస్థకు 29ల‌క్షలు..,ది బిల్ సాప్టు టెక్నాల‌జీస్ 9 ల‌క్షలు.., యాక్ట్‌ ఫైబ‌ర్ నెట్‌కు 14 ల‌క్షలు…, ది హాత్ వే బ్రాండ్‌కు 8ల‌క్షల రూపాయల ఫైన్ చెల్లించాల‌ని నోటిసులు ఇచ్చారు అధికారులు.

కరోనాతో వ్యాపారాలు లేక :-
అయితే ఒక వైపు కరోనా..,మరోవైపు వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు…భారీగా ఫైన్లు వేయ్యడంతో ఏం చేయ్యాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. తాము ఫైన్లు చెల్లించలేమంటూ…మాఫి చేయ్యాలని పలువురు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే నగరం అందవిహీనంగా ఉన్నందుకే ఈ చర్యలు చేపడుతున్నామంటున్నారు అధికారులు. సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్, సి.ఇ.సి మొబైల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులతో పోస్టర్లు, బ్యాన‌ర్లు, ఫ్లెక్సీలు, క‌టౌట్లకు ఫైన్లు వేయ్యడమే కాకుండా వాటి తొలగింపుపై కూడా దృష్టి పెట్టింది బల్దియా.