Group-1 notification: తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 503 పోస్టులతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Group-1 notification: తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

Group 1 Notification

Group-1 notification: తెలంగాణ నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 503 పోస్టులతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వెలువడ్డ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ కావడం విశేషం. ఇటీవలే గ్రూప్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్, మెయిన్స్ (రాత పరీక్షలు) అనే రెండు దశల ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష మెయిన్స్‌కు అర్హత పరీక్ష మాత్రమే.

Epil Jobs : ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ

తాజాగా విడుదలైన నోటిఫికేషన్‌లో అత్యధికంగా ఎంపీడీవో పోస్టులు 121 ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 42, డీఎస్పీ పోస్టులు 91, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 48 ఉన్నాయి. వీటితోపాటు ఆర్‌టీఓ, డిస్ట్రిక్ రిజిష్ట్రార్ వంటి మొత్తం 18 వేర్వేరు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు చివరి తేది మే 31. జూలై లేదా ఆగష్టులో ప్రిలిమినరీ పరీక్షలు జరిగితే, ఇదే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. ప్రిలిమ్స్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) 150 మార్కులకు జరిగితే, మెయిన్స్ పరీక్ష 900 మార్కులకు ఉంటుంది. మెయిన్స్‌లో ఇంగ్లీష్ (అర్హత పరీక్ష)తోపాటు మరో ఆరు సబ్జెక్టులు ఉంటాయి.