ఔటర్ రింగ్ రోడ్డుపై ఆ.. లేన్‌లోకి వెళ్తే బాదుడే

ఫాస్టాగ్‌ విషయంలో హెచ్‌జీసీఎల్‌ కఠినంగా వ్యవహరించనున్నది. ఇందులో భాగంగా 158 కిలోమీటర్ల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు రంగుల్లో ఉండే ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశారు. 

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 02:53 AM IST
ఔటర్ రింగ్ రోడ్డుపై ఆ.. లేన్‌లోకి వెళ్తే బాదుడే

ఫాస్టాగ్‌ విషయంలో హెచ్‌జీసీఎల్‌ కఠినంగా వ్యవహరించనున్నది. ఇందులో భాగంగా 158 కిలోమీటర్ల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు రంగుల్లో ఉండే ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశారు. 

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై నిబంధనలను అతిక్రమించే వాహనదారుల నుంచి రెట్టింపు రుసుం వసూలు చేయాలని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) అధికారులు నిర్ణయించారు. ఇకనుంచి కచ్చితంగా నిర్దేశించిన లేన్‌లోనే వాహనదారుడు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌ విషయంలో హెచ్‌జీసీఎల్‌ కఠినంగా వ్యవహరించనున్నది. ఇందులో భాగంగా 158 కిలోమీటర్ల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు రంగుల్లో ఉండే ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశారు. 

మార్చి 15 నుంచి వీటి మీదుగా ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలు ఆరెంజ్‌ కలర్‌, ఆ సౌకర్యం లేనివి బ్లూకలర్‌ లేన్‌లో మాత్రమే ప్రవేశించాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్‌ 2 నుంచి ఫాస్టాగ్‌ లేకుండా ఆరెంజ్‌ కలర్‌ లేన్‌లోకి వస్తే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తారు. ఫాస్టాగ్‌ లేన్‌లోకి మాన్యువల్‌గా నగదు చెల్లిస్తామంటూ వస్తున్న వాహనదారుల సంఖ్య ఇటీవల  పెరిగింది. నిర్దేశించిన లేన్‌లోనే వాహనదారులు ప్రయాణించాలని, లేదంటే రెట్టింపు చార్జీలు వసూలుచేస్తామని ఔటర్‌ విభాగం అధికారులు టోల్‌గేట్‌ కేంద్రాల వద్ద హెచ్చరిక నోటీసులు అంటించారు. 

ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి ఫాస్టాగ్‌ లేన్‌లోకి వచ్చే ఇతరులు కచ్చితంగా అధికరుసుం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఔటర్‌ రింగ్ రోడ్డుపై నిత్యం 1.25 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో 50 శాతానికిపైగా ఫాస్టాగ్‌తోనే ప్రయాణిస్తున్నాయి.  

Also Read | నెల్లూరులో కరోనా ఎఫెక్ట్: మార్చి 18వరకు స్కూళ్లకు సెలవు