Basara IIIT : బాసర ట్రిపుల్‌ ఐటీలో హైటెన్షన్‌..చిచ్చు రేపిన మంత్రి సబితా సిల్లీ డిమాండ్స్‌ కామెంట్స్‌

గత మూడు రోజులుగా ఫ్యాకల్టీని నియమించాలని .. మౌలిక వసతులను కల్పించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాదాపు 8వందల మంది విద్యార్థులు .. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. AISF, SFIతోపాటు సీపీఐ నేత నారాయణ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

Basara IIIT : బాసర ట్రిపుల్‌ ఐటీలో హైటెన్షన్‌..చిచ్చు రేపిన మంత్రి సబితా సిల్లీ డిమాండ్స్‌ కామెంట్స్‌

Bsara Iiit

Basara IIIT : బాసర ట్రిపుల్‌ ఐటీలో హైటెన్షన్‌ కొనసాగుతోంది. మూడు రోజులుగా ఆందోళనలతో హోరెత్తిన క్యాంపస్‌లో .. ఇవాళ కూడా యుద్ధవాతావరణమే కనిపిస్తోంది. విద్యార్థుల ఆందోళనపై స్పందించిన విద్యాశాఖామంత్రి సబితా.. సిల్లి డిమాండ్స్‌ అనడంతో.. ఈ ఆందోళనకు అగ్గి రాజేసినట్లైంది. ఆఖరికి డైరెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ను నియమించినా.. విద్యార్థులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. సీఎం కేసీఆర్ లేదంటే మంత్రి కేటీఆర్ వచ్చే వరకు పోరాటం ఆగదని తెగేసి చెబుతున్నారు. దీంతో రోజు రోజుకు బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆందోళన ఉధృతమవుతోంది. ఇవాళ కూడా ఆందోళనలు హోరెత్తనున్నాయి.

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. వారి నిజమైన డిమాండ్‌లపై.. సిల్లీ అంటూ కాంమెంట్‌ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది తెలంగాణ భవిష్యత్తుపై.. కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని తెలుపుతుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని.. సీఎం మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులను.. ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.

Basara IIIT Water Cut : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తాగునీరు కట్..!

అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇవాళ బాసరకు వెళ్తున్నారు. అలాగే కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సైతం రానున్నారు. దీంతో రాజకీయ నేతల రాకపై నిఘా పెట్టిన పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలర్ట్‌ అయ్యారు. అటు బాసర రైల్వేస్టేషన్‌తో పాటు రెండు కిలోమీటర్ల దూరంలోనే పికెటింగ్‌ ఏర్పాటుచేశారు. అంతేకాదు ఆందోళనచేసే విద్యార్థులు మెయిన్‌ గేట్‌ దగ్గర నుంచి కనిపించకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు. అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ.. పోలీసులు మూడంచల భద్రతతను ఏర్పాటుచేయడంపై.. పొలిటికల్‌ లీడర్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

గత మూడు రోజులుగా ఫ్యాకల్టీని నియమించాలని .. మౌలిక వసతులను కల్పించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాదాపు 8వందల మంది విద్యార్థులు .. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు తల్లిదండ్రులతో పాటు.. పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. AISF, SFIతోపాటు సీపీఐ నేత నారాయణ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. అయితే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన విద్యార్ధి సంఘం నేతలు, నారాయణను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో టెన్షన్..టెన్షన్

ఇక వీసీని నియమించే వరకు.. సమస్యలను పరిష్కరించేవరకు ఆందోళన ఆగదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. కొత్తగా వచ్చిన డైరెక్టర్ సతీశ్‌ను కలిసిన విద్యార్థులు… ఫ్యాకల్టీ, లైబ్రరీ, డ్రెస్ కోడ్‌ అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తమ 12 డిమాండ్లను పరిష్కరించాల్సిందేనంటున్నారు. దీంతో విద్యార్థులతో చర్చలు జరిపారు నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముష్రాఫ్‌ అలీ. అనంతరం చర్చలు సఫలం అయ్యాయని చెప్పారు. విద్యార్థులు తమముందు పెట్టిన 12 డిమాండ్లను అంగీకరించామన్నారు.

అన్ని డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నా ఆయన.. విద్యార్థుల్ని నిర్బంధించి చర్చించామన్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ఇవాళ్టి నుంచి విద్యార్థులు క్లాసులకు హాజరవుతారని కలెక్టర్‌ ప్రకటించారు. అయితే విద్యార్థుల డిమాండ్లలో కొన్ని పరిష్కరించలేని విధంగా ఉన్నాయన్నారు. సీఎం వచ్చి విద్యార్థులతో చర్చించాలన్న డిమాండ్‌ సరికాదన్నారు.

Narayana Arrest : బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ అరెస్ట్

అయితే విద్యార్థుల ఉద్యమం వెనుక ఎవరున్నారో త్వరలో తేలుతుందని కలెక్టర్‌ ముష్రాఫ్ చెప్పారు. అటు బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.. డైరెక్టర్ సతీశ్‌కుమార్. ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలు.. విద్యార్థుల డిమాండ్లలో సత్వరంగా పరిష్కరించాల్సిన డిమాండ్‌లేవి అని అడిగి తెలుసుకున్నారు.