Hyderabad gold robbery : వేసిన తాళం వేసినట్లే..బీరువాలో కిలో బంగారం మాయం..

Hyderabad gold robbery : వేసిన తాళం వేసినట్లే..బీరువాలో కిలో బంగారం మాయం..

Hyderabad Gold Robbery

Hyderabad House gold robbery : చోరీలు చేయటంలో ఒక్కో దొంగది ఒక్కో రకంగా స్టైల్. కొంతమంది ఇంటితాళాలు పగులగొట్టటంలో ఆరితేరిపోతే..మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా చోరీలు చేసి సైలెంట్ గా చెక్కేసేవాళ్లు మరికొందరు. కానీ హైదరాబాద్ నగర శివారుల్లో జరుగుతున్న చోరీలు జరిగిన విధానం చూసి పోలీసులకే దిమ్మ తిరిగిపోతోంది. నగర శివారలుల్లో చోరీలకు పాల్పడే స్మార్డ్ దొంగలు బీరువాలకు వేసిన తాళం వేసినట్లే ఉండగా లోపలున్న బంగారం, డబ్బుని తస్కరించటం వీళ్ల స్టైల్..హైదరాబాద్ శివారులోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ గ్రామంలో పల్లె రాములు గౌడ్‌ అనే వ్యక్తి ఇంటిలో జరిగిన చోరీని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. చోరీ ఎలా జరిగిందో చూడా అంతుబట్టకుండా ఉన్నదంతా ఊడ్చుకెళ్లిన దొంగల తెలివికి పోలీసులు ఆశ్చర్యపోయారు.

సాధారణంగా దోపిడీకి వచ్చిన దొంగలు ఇంటిని చిందరవందరగా పడేసి.. బీరువాలో ఉన్న సామాన్లు కిందపడేసి.. వస్తువులను పగలకొట్టి నానా హంగామా చేసి దొంగలు వారి పని పూర్తి చేసుకొని వెళ్తారు. ఏదో విధంగా దొంగలు వదిలేసిపోయిన క్లూస్ ను పోలీసులు కనిపెట్టి దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తారు. కానీ ఓ కేసులో పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. దొంగతనం ఎలా జరిగిందో కూడా తెలియలేదు. కానీ ఇంట్లో ఉన్న బంగారం మాత్రం మాయం అయిపోయింది. కనీసం చోరీ జరిగిన ఆనవాలు కూడా లేదు. ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉన్నాయి. అసలు ఆ ఇంట్లో చోరీ జరిగిందా? లేదా? అనే అనుమానం వచ్చేలా ఉంది.కానీ చోరీ జరిగింది. ఈ వింత చోరీని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. చోరీ జరిగిందని మాత్రం తెలుస్తోంది. కానీ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. కేసు నమోదు చేసుకున్నా..ఈ కేసు దర్యాప్తు ఎలా ప్రారంభించాలో.. ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాకుండా జుట్టు పట్టుకుంటున్నారు పోలీసులు. ఈ కేసు చాలా విచిత్రంగా ఉందని.. కేసుకు సంబంధించి సాంకేతికంగా, టెక్నికల్‌గా పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. ఈ వింత దొంగతనం హైదరాబాద్ శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఈ వింత చోరీ కేసు వివరాల గురించి కీసర సీఐ జె.నరేందర్‌ గౌడ్‌ ఇలా తెలిపారు..హైదరాబాద్ శివారులోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ గ్రామంలో పల్లె రాములు గౌడ్‌ అతని భార్య పల్లె సునీత, కుమారుడు మణికంఠ, కోడలు తేజస్వి ఒకే ఇంట్లో ఉంటున్నారు. రాములు గౌడ్ భార్య సునీత తన బంధువుల ఇంట్లో ఓ ఫంక్షన్ ఉంటే వెళ్లింది. మిగతావారంతా ఇంట్లోనే ఉన్నారు. కానీ సునీత ఇంటికొచ్చి చూసేసరికి బీరువాలో ఉన్న కిలో బంగారు నగలు మాయం అయ్యాయి. దీంతో ఆమె షాక్ అయ్యింది. ప్రతీరోజు తాను పెట్టిన ఉన్న నగలు ఉన్నాయో లేదో చూసుకుంటుంటుండేది. అలాగే ఫంక్షన్ నుంచి వచ్చాక కూడా చూసింది. కానీ నగలు లేనేలేవు. కానీ బీరువా లాకర్ లో పెట్టిన బాక్సులు పెట్టినట్లే ఉన్నాయి. కానీ దాంట్లో అందులో రూ.50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు మాత్రం కనిపించలేదు.

దీంతో ఆమెకు కాళ్లు, చేతులు ఆడలేదు. వెంటనే కుటుంబసభ్యులను అడిగింది. వాళ్లు కూడా షాక్ అయ్యారు. మేం తీయలేదని చెప్పారు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. బీరువా తాళం పగలకుండా అందులో బంగారం అపహరణకు గురైందని బాధితురాలు పోలీసులకు చెప్పింది. 24 గంటల పాటు ఇంట్లో ఎవరో ఒకరుంటారు. బీరువా తాళాలు ఇంట్లోనే ఉన్నాయి. బీరువాలోని బాక్సులూ ఉన్నాయి. కానీ, బాక్సుల్లోని బంగారం మాత్రం చోరీకి గురైంది. కీసర పోలీస్ స్టేషన్ సీఐ జె.నరేందర్‌ గౌడ్‌ కేసు నమోదు చేసుకున్నారు. బీరువా పగిలిపోకుండా, తాళాలు ఇంటి యజమాని వద్ద ఉన్నా బీరువా బాక్సుల్లో ఉన్న కిలో బంగారం మాయమైపోవడంతో ఈ కేసు చాలా విచిత్రంగా ఉందని కీసర సీఐ తెలిపారు. త్వరలోనే టెక్నికల్ గా ఈ కేసుకు సంబంధించిన వివరాలను, చోరీ చేసిన నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు.