Telangana : రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు

తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. గురు శుక్రవారాల్లో ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు

Telangana : రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు

Rain In Telangana

Rain In Telangana: తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని.. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో నిక్షిప్తమైందని వివరించారు. దీని ప్రభావంతో తూర్పు నుంచి గాలులు వీస్తాయని పేర్కొన్నారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాలో తేలికపాటి వర్షం కురిస్తే అవకాశం ఉందని తెలిపారు.

చదవండి : Jawad Effect.. Heavy Rains: జొవాద్ ప్రభావంతో.. అతిభారీ వర్షాలు

ఉష్ణోగ్రతల్లో కూడా స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు. కాగా గత నెలలో తెలంగాణలో భారీ వర్షాలే కురిశాయి. రాష్ట్రంలో గత 20 రోజుల నుంచి వాతావరణం పొడిగా ఉంటుంది. గురు, శుక్రవారాల్లో తేమ వాతావరణం ఉంటుందని, తిరిగి శనివారం పొడివాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.

చదవండి : Heavy Rains Forecast : రాగల మూడు రోజుల్లో ఏపీలో మళ్లీ భారీ వర్షాలు