Groundwater : తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు | Increased groundwater in Telangana

Groundwater : తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు

ఆదిలాబాద్‌ నుంచి కొత్తగూడెం వరకు గ్రౌండ్ వాటర్‌పై నీటిపారుదల శాఖ అధికారులు స్టడీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 4 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.

Groundwater : తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు

Increased groundwater : తెలంగాణలో 50 శాతం మండలాల్లో భారీగా భూగర్భజలాలు పెరిగాయి. 29 మండలాల్లో మాత్రమే నీటి లభ్యత తక్కువగా ఉంది. భూగర్భ జలాలపై నీటిపారుదల శాఖ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి. హైదరాబాద్‌లోని జలసౌధలో భూగర్భజలాలకు సంబంధించిన నివేదికను విడుదల చేశారు నీటిపారుదల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌.

ఆదిలాబాద్‌ నుంచి కొత్తగూడెం వరకు గ్రౌండ్ వాటర్‌పై నీటిపారుదల శాఖ అధికారులు స్టడీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 4 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. ఒక్కో మీటర్‌ వంద టీఎంసీలతో సమానం. గతంలో కంటే భూగర్భజలాలు పెరగడంతో నీటిలో లవణాల శాతం తగ్గింది. అయినా కొన్ని జిల్లాల్లో ఇంకా నైట్రోజన్‌, ఫ్లోరైడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

CM KCR : 33 జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను నియమించిన సీఎం కేసీఆర్

రానున్న రోజుల్లో భూగర్భజలాలు పెరుగుతాయి..దీంతో నైట్రోజన్, ఫ్లోరైడ్ శాతం తగ్గుతుందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే భూగర్భ జలాలు పెరగడంతో వరి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపయోగమేనన్నారు. తెలంగాణలో రికార్డుస్థాయిలో వరి పంట సాగు చేస్తున్నారు. వరి ప్రత్యామ్నాయ పంటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి సమయంలో భూగర్భజలాలు పెరగడం రైతులకు ఊరటనివ్వనుంది.

×