KTR Vs Rahul Gandhi : సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు ప్రధాని అవుతారట : రాహుల్‌పై కేటీఆర్ సెటైర్లు

సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు ప్రధాని అవుతారట..ప్రధాని అవ్వాలంటే ముందు తన సొంత నియోజకవర్గంలో గెలవాలి అంటూ రాహుల్‌పై కేటీఆర్ సెటైర్లు వేశారు.

KTR Vs Rahul Gandhi : సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు ప్రధాని అవుతారట : రాహుల్‌పై కేటీఆర్ సెటైర్లు

KTR Vs Rahul Gandhi

KTR Vs Rahul gandhi : రాహుల్ గాంధీపై కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా సెటైర్లతో విరుచుకుపడ్డారు. పీఎం కావాలనుకునే వ్యక్తి ముందు ఎంపీగా గెలవాలని సూచించారు. ప్రధాని కావాలంటే అంతర్జాతీయ లీడర్‌ రాహుల్ గాంధీ ముందు అన సొంత నియోజకవర్గం అయిన అమేథీలో MPగా గెలవాలి అంటూ రాహుల్ కు చురకలు వేశారు కేటీఆర్. భావి ప్రధానికావాలంటే రాహుల్ ముందు ఎంపీగా గెలవాలంటూ చురకలు వేశారు. అమేథీలో ఎంపీగా గెలవలేని రాహుల్ గాంధీ కేసీఆర్ జాతీయ పార్టీ (బీఆర్ఎస్)ఆశయాలను అపహాస్యం చేస్తారా? అంటూ మండిపడ్డారు. జాతీయ పార్టీ ఆశయాలతో ముందుకెళుతున్న కేసీఆర్ ను విమర్శించే రాహుల్ గా లేదన్నారు కేటీఆర్.

కాగా..కాంగ్రెస్ నేత వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. ఈ యాత్ర హైదరాబాద్ లో కొనసాగుతోంది. ఈ యాత్ర సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైరిగ్ గా రియాక్ట్ అయ్యారు. రాహుల్ ఆరోపణలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్… ముందు అమేథిలో గెలవాలను సూచించారు.

అంతర్జాతీయ లీడర్ అంటూ తన ట్వీట్ స్టార్ట్ చేసిన కేటీఆర్ తనదైనశైలిలో సెటైర్లు వేశారు. కనీసం తన సొంత నియోజకవర్గం అమేథి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేని అంతర్జాతీయ లీడర్ రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించడం ఏమాత్రం బాగాలేదన్నారు. కేసీఆర్‌తోపాటు ఆయన జాతీయ పార్టీ ఆకాంక్షపై కూడా విమర్శలు చేయడం సరైందికాదన్నారు. అంతేకాదు భావి ప్రధాని కావాలనుకునే రాహుల్‌ గాంధీ ముందు తన అమేథీ ప్రజలను ఒప్పించి MPగా ఎన్నిక కావాలంటూ ఎద్దేవా చేశారు.

కాగా..టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తులేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం (అక్టోబర్‌ 30)మీడియాతో మాట్లాడుతూ స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని..ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ తో పొత్తు వద్దని టీపీసీసీ నిర్ణయమని..ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈసందర్బంగా రాహల్ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంపై కూడా మాట్లాడుతూ..బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు మునుగోడు ఉపఎన్నికకు రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.