JEE Exam Smart Copying : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ కలకలం.. ఇంటర్‌లో టాపరే కీలక సూత్రదారి..!

ఎగ్జామ్ సెంటర్లోకి నలుగురు స్నేహితులు స్మార్ట్ ఫోన్ ను తీసుకెళ్లారు. ఎస్‌వీఐటీలోని పరీక్ష కేంద్రం నుంచి మిగిలిన ముగ్గురు స్నేహితులకు టాపర్ విద్యార్థి వాట్సాప్ ద్వారా సమాదానాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు.

JEE Exam Smart Copying : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ కలకలం.. ఇంటర్‌లో టాపరే కీలక సూత్రదారి..!

JEE Exam Smart Copying

JEE Exam: టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం విధితమే. గ్రూప్1 సహా పలు పరీక్షలు రద్దయ్యాయి. లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ క్రమంలో దాదాపు 45 మంది వరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మరవక ముందే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష(JEE Advanced Exam) లో స్మార్ట్ కాపీయింగ్ (Smart copying) వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలోని కీలక సూత్రదారులను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అదుపులోకి తీసుకున్నారు.

TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. పరీక్షా కేంద్రాల నుంచి కూడా ప్రశ్నాపత్రం లీకైనట్లు నిర్ధారణ

జేఈఈ పరీక్షలో నలుగురు విద్యార్థులు స్మార్ట్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఎలక్ట్రానిక్ డివైసెస్ (Electronic devices) ద్వారా వీరు కాపీ చేశారు. ఆదివారం పరీక్ష జరగగా.. స్మార్ట్ కాపీయింగ్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ స్మార్ట్ కాపీయింగ్‌లో కీలక సూత్రదారి కడప జిల్లాకు చెందిన టాపర్‌గా గుర్తించారు. టెన్త్, ఇంటర్‌లో అతను టాపర్. అయితే, తన స్నేహితులకు మంచి మార్కులు రావాలనే ఈ కాపీయింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌లోని ఎస్‌వి‌ఐ‌ఈ పరీక్షా కేంద్రం నుంచి అతడు ఈ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు.

TSPSC Paper Leak Case : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సంచలన నిజాలు.. ఏఐ, చాట్ జీపీటీ ఉపయోగించి

హైటెక్ సిటీలోని ఓ కాలేజీలో చదువుతున్న నలుగురు విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఎలాగైనా మంచి స్కోర్ చేయాలని అనుకున్నారు. ఇందుకోసం అడ్డదారి తొక్కి అడ్డంగా దొరికిపోయారు. ఇందులో ఒకరు కడప జిల్లాకు చెందిన విద్యార్థి. టెన్త్, ఇంటర్‌లో అతడు టాపర్. తన మిత్రులు ఎలాగైనా మంచి మార్కులతో పాస్ అయ్యేందుకు కడప విద్యార్థి ఈ స్మార్ట్ కాపీయింగ్ చేశాడు. తాను రాసిన జవాబు పేపర్ వాట్సప్ ద్వారా మిత్రులకు షేర్ చేశాడు. వివిధ సెంటర్‌లలో ఉన్న నలుగురు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా జవాబు పత్రం చేరవేశాడు. అయితే, ఎస్‌వీఐటీ కాలేజీ సెంటర్‌లో పరీక్ష రాస్తున్న కడప విద్యార్థిపై అబ్జర్వర్‍‌కు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని తనిఖీ చేయగా స్మార్ట్ ఫోన్ దొరికింది. దీంతో స్మార్ట్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

TSPSC : 15నిమిషాలు దాటితే నో ఎంట్రీ, మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వరు, ఆధార్ మస్ట్.. గ్రూప్-1 పరీక్షకు TSPSC పటిష్ట చర్యలు

స్మార్ట్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించిన వెంటనే విషయాన్ని అబ్జర్వర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే, పోలీసుల విచారణలో ఎగ్జామ్ సెంటర్లలోకి  నలుగురు స్నేహితులు స్మార్ట్ ఫోన్ ను తీసుకెళ్లారు. ఎస్‌వీఐటీలోని పరీక్ష కేంద్రం నుంచి మిగిలిన ముగ్గురు స్నేహితులకు టాపర్ విద్యార్థి వాట్సాప్ ద్వారా సమాదానాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. టాపర్ ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.