TSPSC Paper Leak Case : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సంచలన నిజాలు.. ఏఐ, చాట్ జీపీటీ ఉపయోగించి

TSPSC Paper Leak : మైక్రోఫోన్లు, డివైజ్ లు, బ్లూటూత్స్ అభ్యర్థులకు రహస్యంగా అమర్చి పరీక్షా కేంద్రంలోకి పంపాడు. అభ్యర్థుల ప్రశ్నాపత్రాలను ఇన్విలేజటర్లు వాట్సాప్ చేశారు. చాట్ జీపీటీ, ఇతర నిపుణుల సాయంతో సమాధానాలు బ్లూటూత్ ద్వారా అభ్యర్థులకు చేరవేశాడు డీఈ రమేశ్.

TSPSC Paper Leak Case : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సంచలన నిజాలు.. ఏఐ, చాట్ జీపీటీ ఉపయోగించి

TSPSC Paper Leak Case

TSPSC – SIT : టీఎస్ పీఎస్ సీ(తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఫైల్స్ లో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. దర్యాఫ్తులో బయటపడుతున్న విషయాలు చూసి సిట్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. నిందితులు మాస్ కాపీయింగ్ కు హైటెక్ టెక్నాలజీని ఉపయోగించినట్లు తేలడం అందరినీ నివ్వెరపరిచింది.

మాస్ కాపీయింగ్ కోసం విద్యుత్ శాఖ డీఈ(డివిజనల్ ఇంజినీర్) రమేశ్ ఆధ్వర్యంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), చాట్ జీపీటీ ఉపయోగించారు. నిందితులు ఎంత పక్కా ప్లాన్ తో ఉన్నారో దీని వల్ల అర్థమవుతుంది. వరంగల్ లోని ఓ పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు హైటెక్ కాపీయింగ్ కు పాల్పడినట్లు తేలింది. ఏఈఈ పరీక్షలో కొందరు అభ్యర్థులు చాట్ జీపీటీ సహకారంతో సమాధానాలు గుర్తించినట్లు సిట్ విచారణలో తేలింది.

Also Read..Kishan Reddy : లక్షలాది మంది చేరుతున్నారు, తెలంగాణలో బలపడుతోంది- కిషన్ రెడ్డి

ముగ్గురు అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో వెళ్లగా.. డీఈ రమేశ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానాలు గుర్తించి వారికి చేరవేసినట్లు తేలింది. డీఈ రమేశ్ ఒకవైపు ఉద్యోగం చేస్తూ ఓ కోచింగ్ సెంటర్ లో ఫ్యాకల్టీగా కొనసాగుతున్నాడు. ప్రశాంత్, నరేశ్, మహేశ్ అనే ముగ్గురు అభ్యర్థుల వద్ద రూ.20లక్షలు చొప్పున తీసుకుని పరీక్షా కేంద్రం నిర్వాహకులతో ముందే డీల్ చేసుకున్నాడు.

ఆ ముగ్గురు అభ్యర్థులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హైటెక్ కాపీయింగ్ అమలు చేశాడు. మైక్రోఫోన్లు, డివైజ్ లు, బ్లూటూత్స్ అభ్యర్థులకు రహస్యంగా అమర్చి పరీక్షా కేంద్రంలోకి పంపాడు. అభ్యర్థుల ప్రశ్నాపత్రాలను ఇన్విలేజటర్లు వాట్సాప్ చేశారు. చాట్ జీపీటీ, ఇతర నిపుణుల సాయంతో సమాధానాలు బ్లూటూత్ ద్వారా అభ్యర్థులకు చేరవేశాడు డీఈ రమేశ్.

Also Read..KA Paul : అధికారంలోకి వస్తే.. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు- కేఏ పాల్ సంచలనం

మరోవైపు టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసు దర్యాఫ్తులో సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. మరికొందరిపై డీబార్ వేటు వేసింది. ఏకంగా 13మంది నిందితులను శాశ్వతంగా డీబార్ చేసింది. వీరంతా భవిష్యత్తులో మళ్లీ టీఎస్ పీఎస్ సీ నిర్వహించే ఏ ఇతర పరీక్షలకు కూడా హాజరుకాకుండా చర్యలు తీసుకుంది. ఉద్యోగాలు పొందకుండా శాశ్వతంగా డీబార్ చేసింది. ఈ మేరకు జాబితాను టీఎస్ పీఎస్ సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ విడుదల చేశారు. మొత్తం డీబార్ అయిన వారి సంఖ్య 50కి పెరిగింది.

డీఈ రమేశ్ 30మందికి క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30లక్షలు తీసుకున్నట్లు తెలుసుకున్నారు. ఆ విధంగా 35మంది అభ్యర్థుల నుంచి డీఈ రమేశ్ రూ.10 కోట్లు తీసుకున్నట్లు చెప్పారు. డబ్బులు ఇచ్చిన అభ్యర్థుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు.