KA Paul: అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాలేదు: కేఏ పాల్

KA Paul: కవిత అరెస్ట్ అయితే అవనివ్వండి, అవినీతి చేయకపోతే బయటకి వస్తారు కదా? అని కేఏ పాల్ అన్నారు.

KA Paul: అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాలేదు: కేఏ పాల్

KA Paul

KA Paul: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor scam)లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ అయినా కవిత అరెస్ట్ కాలేదని గుర్తు చేశారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 30-35 స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించేలా ప్లాన్ చేశారని కేఏ పాల్ అన్నారు. అదే జరిగితే మొత్తం తెలంగాణను బీజేపీ హస్తగతం చేసుకుంటుందని చెప్పారు. కేసీఆర్ తనతో కలిసి పనిచేయాలని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రం కోసం, స్టీల్ ప్లాంట్ (Vizag Steel plant) కోసం, దేశం కోసం తనతో కలిసి రావాలని చెప్పారు.

కవిత అరెస్ట్ అయితే అవనివ్వండి, అవినీతి చేయకపోతే బయటకి వస్తారు కదా? అని కేఏ పాల్ అన్నారు. బీజేపీపై పోరాటానికి అన్ని పార్టీలు తనతో కలిసి రావాలని చెప్పారు. లెఫ్ట్ పార్టీలకు ఓటు శాతం లేదని.. కానీ, నిజాయితీ గల పార్టీలని అన్నారు. ఆ పార్టీ నేతలు కూడా తనతో కలిసి రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె అరెస్టు కాలేదు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

Gone Prakash Rao: తెలంగాణ ప్రభుత్వంపై గోనె ప్రకాశరావు ఫైర్.. పట్టించుకోవడం లేదని..