కేసీఆర్ ప్రకటన : చికెన్..గుడ్లకు ఫుల్ డిమాండ్

  • Published By: madhu ,Published On : March 30, 2020 / 04:01 AM IST
కేసీఆర్ ప్రకటన : చికెన్..గుడ్లకు ఫుల్ డిమాండ్

ఒక నెల రోజుల కిందట పౌల్ట్రీ రంగాన్ని చూస్తే ఎవరికైనా బాధ కలిగింది. సార్..ఫ్రీ గానే చికెన్, కోళ్లను ఇస్తాం తీసుకెళ్లండి..అంటే జనాలు దూరం జరిగాయి. వామ్మో..నీ చికెన్ వద్దు..కోడి గుడ్డు వద్దు అన్నారు. ఏమీ భయం లేదు..చికెన్, గుడ్లను శ్రుభ్రంగా తినొచ్చు అని తెలంగాణ మంత్రులు చెప్పినా..ప్రజలు అంతగా పట్టించుకోలేదు. దీనికంతటికి కారణం కరోనా మహమ్మారి.

‘చికెన్ తింటే ఏమీ కాదు..శుభ్రంగా తినొచ్చు..అలాగే కోడి గుడ్లను కూడా ఆహారంలో తీసుకోవచ్చు. బత్తాయిలు, సంత్రాలు తినొచ్చు..వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది’ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది.

2020, మార్చి 29వ తేదీ..మాంసాహార ప్రియుళ్లు ఉదయాన్నే చేతిలో సంచి, జేబులో డబ్బులు తీసుకుని రోడ్లపై పడ్డారు. దీంతో చికెన్, మటన్ షాపులు కళకళలాడాయి. దీంతో వ్యాపారం మూడు కోళ్లు, ఆరు గుడ్లగా మారిపోయింది. ధరలు కూడ పెరిగిపోయాయి. 

కరోనా భయంతో నెల రోజుల పాటు చికెన్, గుడ్లు తినడానికి దూరంగా ఉన్నారు. దీంతో పౌల్ట్రీ రంగం పూర్తిగా కుదేలు అయిపోయింది. కానీ కేసీఆర్ చేసిన ప్రకటనతో ఆదివారం జిల్లాలో స్కిన్ లెస్ చికెన్ రూ. 180, డ్రెస్ డ్ రూ. 160 చొప్పున విక్రయించారు.

ప్రస్తుతం ధరలు పెరగడంతో పౌల్ట్రీ రైతులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుమారు 70 వేల చికెన్ విక్రయాలు జరిగాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం ముందుగానే చెప్పినట్లు ప్రజలు సామాజిక దూరం పాటించారు. మొత్తానికి వ్యాపారం బాగా జరుగుతుండడంతో చికెన్, మటన్ వ్యాపారులు ఫుల్ ఖుష్ గా ఉన్నారు. 

Also Read | రాకెట్లు కాదు : శానిటైజర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు తయారు చేస్తున్న ISRO